తమ్మినేని సీతారాం జనసేనలోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. ఆయనతో బొత్స కీలక భేటీ
తమ్మినేని సొంత నియోజకవర్గం ఆముదాలవలసకి కొత్త ఇన్‌చార్జిని నియమించారు. ఈ నేపథ్యంలోనే తమ్మినేని అసంతృప్తితో ఉన్నారని, ఆయన కుటుంబం జనసేన వైపు చూస్తోందని ప్రచారం జరుగుతోంది.

శ్రీకాకుళం జిల్లాలోని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం నివాసానికి శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెళ్లారు. ఆమదాలవలస నియోజకవర్గ ఇన్‌చార్జ్ మార్పు తర్వాత తమ్మినేని సీతారాం అసంతృప్తిగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది.
పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు తమ్మినేని సీతారాం. త్వరలోనే ఆయన పార్టీ మారతారని ఊహాగానాలు నేపథ్యంలో ఆయనను బొత్స సత్యనారాయణ కలవడంతో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్ని రోజులుగా తమ్మినేని జనసేనలోకి వెళ్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
కాగా, 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి అనంతరం తమ్మినేనిని శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులుగా వైసీపీ నియమించిన విషయం తెలిసిందే. తమ్మినేని సొంత నియోజకవర్గం ఆముదాలవలసకి కొత్త ఇన్‌చార్జిని నియమించారు. ఈ నేపథ్యంలోనే తమ్మినేని అసంతృప్తితో ఉన్నారని, ఆయన కుటుంబం జనసేన వైపు చూస్తోందని ప్రచారం జరుగుతోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తూ.. తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జనసేనలో చేరితే తమ భవిష్యత్తు బాగుంటుందని తమ్మినేని కుటుంబం ఆలోచిస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమ్మినేనితో బొత్స మంతనాలు జరుపుతుండడం గమనార్హం.
పవన్ కల్యాణ్ సంకల్పం మేరకు సంక్రాంతి నాటికి ఈ పని పూర్తి చేస్తాం: మంత్రి నిమ్మల రామానాయుడు