పవన్ కల్యాణ్ సంకల్పం మేరకు సంక్రాంతి నాటికి ఈ పని పూర్తి చేస్తాం: మంత్రి నిమ్మల రామానాయుడు
వైసీపీ నేతలు కరెంట్ ఛార్జీలపై పోరుబాట చేసినా, పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు.

Minister Nimmala ramanaidu
Nimmala Rama Naidu: వైసీపీ అధినేత వైఎస్ జగన్ 2019లో ఒక్క ఛాన్స్ అంటూ అబద్ధాలతో అధికారంలోకి వచ్చారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన నిమ్మల రామానాయుడు ఈ సందర్భంగా మాట్లాడారు.
“జగన్ రాష్ట్రాన్ని లూఠీ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంకల్పం మేరకు సంక్రాంతి నాటికి గుంతలులేని ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. వైసీపీ నేతలు కరెంట్ ఛార్జీలపై పోరుబాట చేసినా, పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
గత టీడీపీ పాలనలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తే, వైసీపీ పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 16 వేల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని వారసత్వంగా అందించారు.
ఇరిగేషన్ శాఖలోనే జగన్ వారసత్వంగా 18 వేల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని ఇచ్చారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా, విధ్వంసం చేయడం వల్ల ఇప్పుడు డబుల్ వర్క్ చేయాల్సి వస్తోంది” అని నిమ్మల రామానాయుడు అన్నారు.
Social Media: సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు వద్దంటూ ఏపీ ప్రభుత్వం వినూత్న ప్రచారం