Social Media: సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు వద్దంటూ ఏపీ ప్రభుత్వం వినూత్న ప్రచారం

మూడు కోతులకు జతగా మరో కోతిని చేర్చి చెడు పోస్టులు వద్దని చెప్పింది.

Social Media: సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు వద్దంటూ ఏపీ ప్రభుత్వం వినూత్న ప్రచారం

Updated On : December 29, 2024 / 3:52 PM IST

సామాజిక మాధ్యమాల వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో అందరూ దాని ద్వారానే ప్రచారాలు చేసుకోవాలనుకుంటున్నారు. చాలా మంది సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెగిటివిటీ విపరీతంగా పెరిగిపోతుండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న రీతిలో దీనిపై ప్రచారం చేస్తోంది.

సామాజిక మాధ్యమాలను మంచికే వాడుదామంటూ ఏపీలో పలు నగరాల్లో భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. చెడు వినవద్దు, కనవద్దు, మాట్లాడొద్దు అంటూ గాంధీజీ చెప్పిన సూక్తిని ఇందుకు వాడుకుంది. మూడు కోతులకు జతగా మరో కోతిని చేర్చి చెడు పోస్టులు వద్దని చెప్పింది.

“పోస్ట్ నో ఈవిల్” అంటూ నాలుగో కోతి బొమ్మతో సోషల్ మీడియా గురించి సందేశం ఇచ్చింది. మేక్ సోషల్ మీడియా ఎ పాజిటివ్ ఎక్స్ పీరియన్స్ పేరుతో ప్రధాన కూడళ్లలో హోర్డింగ్స్ ఏర్పాటు చేసింది. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేయవద్దని చెప్పింది.

అలాగే, విద్వేష రాతలు వద్దంటూ ప్రచార చేస్తోంది. విజయవాడ- గుంటూరు దారిలో తాడేపల్లి హైవే వద్ద ఈ భారీ హోర్డింగ్‌లు కనపడుతున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతం, తిరుపతి, విశాఖ వంటి నగరాల్లో ఈ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు.

Perni Nani Vs JC Prabhakar: పేర్ని నాని వ్యాఖ్యలకు జేసీ ప్రభాకర్ కౌంటర్