Deputy CM Narayana Swamy : పార్టీలో నాపై కుట్ర జరుగుతోంది : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు
పార్టీలో నాపై కుట్ర జరుగుతోంది అంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Deputy CM Narayana Swamy
Deputy CM Narayana Swamy : ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా సొంతపార్టీలోనే నాపై కుట్ర జరుగుతోంది అంటూ వ్యాఖ్యానించారు. పార్టీలోనే ఓ వ్యక్తి నాకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నాడు అంటూ మండిపడ్డారు. తాను అవినీతికి పాల్పడుతున్నానంటూ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఓ మండలంలో ఓ వ్యక్తి ఆరోపిస్తున్నారని నేను అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే సదరు వ్యక్తికాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతానని చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. నేను ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్నానని విషయం గుర్తుపెట్టుకోవాలని..నేను సదరు వ్యక్తి గురించి చెబితే ఏమవుతుందో ఆలోచించి మాట్లాడాలి అంటూ హెచ్చరించారు. పార్టీ కోసం నేను కూలివాడిగా పనిచేస్తున్నానని..అటువంటి నామీద అవినీతి ఆరోపణలు చేయటం తగదని..కాదంటే నేనేంటో చూపిస్తాను అంటూ హెచ్చరించారు నారాయణస్వామి.
పార్టీలో ముఖ్య హోదాలో ఉన్న ఆ వ్యక్తి తన గురించి తెలుసుకుని మాట్లాడాలని తనను అవమానిస్తున్న విషయం సీఎం జగన్ కు తెలిస్తే ఏమవుతుందో తెలుసుకోవాలి అంటూ హెచ్చరించారు.పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారు పార్టీ వదిలి వెళ్లిపోవాలని అన్నారు. తను పార్టీ కోసం..జగన్ కోసం కూలివాడికి పనిచేస్తున్నానని అటువంటి తనమీద లేనిపోని ఆరోపణలు చేస్తున్న వ్యక్తి మాత్రం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎంపీటీసీలకు..జెడ్పీటీసీలను కూడగట్టి పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తున్నా సదరు వ్యక్తి ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని లేకుంటే పార్టీనుంచి బయటకు వెళ్లాల్సి వస్తుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి హెచ్చరించారు. కానీ ఆ సదరు వ్యక్తి పేరు మాత్రం నారాయణ స్వామి చెప్పలేదు.