Severe Cold : తెలుగు రాష్ట్రాలను విణికిస్తోన్న చలి… సింగిల్ డిజిట్ కు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా విసిరింది. నాలుగు రోజులుగా తెలంగాణ, ఏపీలను చలి విణికిస్తోంది. రోజుకు రోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోల్డ్ వేవ్ ప్రభావంతో నార్త్ ఇండియాతోపాటు దక్షిణ భారతంలోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.

COLD (1)
Severe cold : తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా విసిరింది. నాలుగు రోజులుగా తెలంగాణ, ఏపీలను చలి విణికిస్తోంది. రోజుకు రోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోల్డ్ వేవ్ ప్రభావంతో నార్త్ ఇండియాతోపాటు దక్షిణ భారతంలోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
మూడు రోజులుగా తెలంగాణలో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు రికార్డు అవుతున్నాయి. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పగటి పూట ఎక్కువగా చలి గాలులు వీస్తున్నాయి. చలి కారణంగా అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి.
రాష్ట్రంలోని జిల్లాలతోపాటు హైదరాబాద్ లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. నగరంలో 10 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. అల్లూరి జిల్లా చింతపల్లిలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. చింతపల్లిలో 1.5 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రత నమోదు కావడంతో గిరిజనులు చలికి వణికిపోతున్నారు. 2016లో ఒక్కసారి చింతపల్లిలో 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఆ తర్వాత అంత తక్కువ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇదే మొదటిసారి.
Cool Winds: ఉత్తరాది కేంద్రంగా దేశంలో భారీగా పెరిగిన చలి తీవ్రత
ఈ నెల ప్రారంభం నుంచి చింతపల్లిలో ఉష్ణోగ్రతలు తగ్గుతూనే ఉన్నాయి. అలాగే పాడేరులో 9, మినుగులూరులో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. మరోవైపు మన్యంలో చలితో పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ప్రకృతి అందాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. లంబసింగి పరిసర గ్రామాల్లో కొండపై నుంచి పొగమంచు అందాలను చూసి పర్యాటకులు పరవశిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులను చలి వణికిస్తోంది.
నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. నిన్న కొమురంభీం జిల్లాలోని సిర్ పూర్ యూలో 4.8,
బజారత్నూరులో 5.4, కెరమెరిలో 5.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రలు నమోదు అయ్యాయి. తీవ్ర చలికి తోడు గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే వణికిపోతున్నారు. చలి నుంచి ఉప శమనం కోసం మంటలు వేసుకుంటున్నారు. పొగమంచుతో రోడ్లపై వాహనాల రాకపోకలకు
తీవ్ర ఇబ్బందిగా మారింది.