మేమున్నామంటూ ఎస్సై సత్యనారాయణమూర్తి ఫ్యామిలీని ఆదుకున్న స్నేహితులు
మొత్తం 45.68 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు.

తోటి ఉద్యోగి మృతి చెందితే అతడి కుటుంబానికి తాము ఉన్నామంటూ ఆదుకున్నారు. అందరూ డబ్బులు వేసుకుని తమ స్నేహితుడి భార్యకు అందించారు. ఇటీవల మృతి చెందిన ఎస్సై ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తికు స్నేహితులు అండగా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్ డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఎస్సై ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి తుపాకి పేలిన ఘటనలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయనది కె.గంగవరం. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పోలీసుస్టేషన్‌లో తుపాకీ పేలడంతో మృతి చెందారు.
Also Read: ఎంత ఘోరం.. కల్లులో పురుగుల మందు కలిపిన వ్యక్తి.. ఎందుకంటే?
ఆయనకు భార్య విజయలక్ష్మితో పాటు కుమారుడు హేమాన్షి (3), కూతురు చందన (16 నెలలు) ఉన్నారు. అలాగే, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. దీంతో సత్యనారాయణ మూర్తి బ్యాచ్ పోలీసులు మొత్తం 45.68 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. స్నేహితులు చేసిన సాయాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు.
కాగా, తణుకు గ్రామీణ ఎస్సై సత్యనారాయణమూర్తి వీఆర్‌లో ఉన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పెనుగొండ పర్యటన వేళ ఎస్కార్ట్ విధుల్లో చేరాలని ఆయనకు ఇటీవల ఆర్డర్స్ రావడంతో సర్వీస్ రివాల్వర్ తీసుకున్నారు.
తణుకు రూరల్ పోలీసు స్టేషన్‌లో బాత్‌రూమ్‌కు వెళ్లి, అక్కడే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని అక్కడికక్కడే మృతి చెందారు. ఆ సమయంలో ఆయన బంధువులు, స్నేహితులు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.