AP COVID Update: ఆంధ్ర రాష్ట్రంలో కరోనాతో ఆరుగురు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 178 కరోనా కేసులు రికార్డయ్యాయి.

AP COVID Update: ఆంధ్ర రాష్ట్రంలో కరోనాతో ఆరుగురు మృతి

Corona

Updated On : November 28, 2021 / 8:34 PM IST

AP COVID Update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 178 కరోనా కేసులు రికార్డయ్యాయి. ఇదే సమయంలో కోవిడ్ వ్యాధితో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఇవాళ(28 నవంబర్ 2021) నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20లక్షల 72వేల 624కి చేరుకుంది. ఏపీలో మొత్తం కరోనాతో 14,438 మంది మృతి చెందారు. ప్రస్తుతం 2వేల 140 కేసులు యాక్టివ్‌గా ఉండగా.. కరోనా నుంచి 20లక్షల 56వేల 46 మంది బాధితులు కోలుకున్నారు.

కరోనా కేసులు పెరుగుతుండడంతో కర్నాటకతో సహా పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించింది ప్రభుత్వం. బెంగళూరు, మైసూర్‌, ధార్వాడడ్‌లో కఠిన నిబంధలు పెట్టింది. సంప్రదాయ వేడుకలు, సమావేశాలు నిర్వహించరాదని ఆదేశించింది ప్రభుత్వం.