‘sorry mosam cheyaledu’ : ‘సారీ మోసం చేయలేదు’ కమాన్ గుసగుస సోషల్ మీడియాలో చర్చ

‘సారీ మోసం చేయలేదు’ అనే పోస్టర్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. రాజమండ్రిలోనే కాదు సోషల్ మీడియాలో రచ్చగా మారింది. ఎవరు ఎవరికి చెప్పారు?

‘sorry mosam cheyaledu’  Mystery posters ‘సారీ మోసం చేయలేదు’ అనే పోస్టర్ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇది రాజమండ్రికే పరిమితం కాలేదు. సోషల్ మీడియాలో గుసగుసగా మారిపోయింది. ఈ పోస్టర్ గోడలపై ఎవరు ఏర్పాటు చేశారు? ఎందుకు? ఎవరు ఎవరికి సారీ చెబుతున్నారు? ప్రియుడు, ప్రియురాలకి చెప్పాడా?లేదా ప్రియురాలే ప్రియుడికి చెప్పిందా?అని జనాలు తెగ గుసగుసలాడుకుంటున్నారు. ఎవరి నోట విన్నా ఇదే మాట..అరె చెప్పండ్రా బాబూ లేదంటే జనాలకు బుర్రలు పగిలిపోయేలా ఉన్నాయి..అంటూ తెగ ఆరాటపడిపోతున్నారు. కొంతమంది అయితే ఏకంగా డిటెక్టివ్ లా మారిపోయి ఈ పోస్టర్ వెనుక ఉండే ఆ రహస్యమేంటో తెలుసుకునే పనిలో పడ్డారట.

Read more : wife picture on house : ఈ ముస్లిం దేశం వెరీ స్పెషల్..ప్రతి ఇంటి గోడలపై భార్యల ఫోటోలు..

ఎవరు చేశారో? ఎందుకు చేశారో గానీ ‘సారీ మోసం చేయలేదు’ అనే పోస్ట్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో రచ్చ చేసేస్తోంది. ‘సారీ మోసం చేయలేదు’ అని పోస్టర్ల ద్వారా చెప్పాలనుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘సారీ మోసం చేయలేదు’ అని రాసి ఉన్న పోస్టర్లు ప్రస్తుతం అందరి నోటా వినిపిస్తున్న మాట. రాజమండ్రిలోని ఏపీ అప్పారావు రోడ్డు, అద్దేపల్లి కాలనీ, షీలానగర్‌ తో పాటు పలు ప్రాంతాల్లో ఈ ‘సారీ మోసం చేయలేదు’ పోస్టర్ల వెనక ఉన్న అసలు కారణం ఎంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎవరు, ఎందుకు ఈ పోస్టర్లు అంటించారన్నది తెలియట్లేదు.

Read more : Viral video : ఛత్తీస్‌గఢ్ సీఎంకు కొరడా దెబ్బలు..దారుణంగా కొట్టిన వైనం

ఎవరిని అడిగినా తమకు తెలియదని మీకేమన్నా తెలిస్తే చెప్పండే..అంటున్నారు. ఓ యువకుడు తన ప్రియురాలికి క్షమాపణ చెప్పేందుకే ఈ పోస్టర్లు వేయించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే.. ఈ భగ్న ప్రేమికుడి క్షమాపణను ప్రియురాలు ఏమేరకు క్షమిస్తుందో ఏమో..ఏది ఏమైనా ఈ ‘సారీ మోసం చేయలేదు’ పోస్టర్ మాత్రం అటు రాజమండ్రి వాసులతో పాటు ఇటు సోషల్ మీడియా వారికి పెద్ద పనే పెట్టింది.

ట్రెండింగ్ వార్తలు