మాన్సాస్ ట్రస్టు వివాదం : ఏపీలో సంచయిత రాజకీయం

విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ చైర్‌పర్సన్ .. విశాఖపట్నం సింహాచలం దేవస్థానం పాలకవర్గం నియామక వ్యవహారంపై రాజకీయ రచ్చ ముదురుతోంది. వంశపారంపర్యంగా వచ్చిన హక్కుతో.. ఇంతకాలం ట్రస్ట్‌బోర్డ్ చైర్మన్‌గా కొనసాగిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును తప్పించి.. ఆయన అన్న కుమార్తె సంచయిత గజపతిరాజుకు ట్రస్ట్ బోర్డ్ నిర్వహణా బాధ్యతలను అప్పగించడం వివాదాస్పదంగా మారింది. సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త హక్కులనూ సంచయితకే అప్పగించడంపై టీడీపీ, బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంచయిత హిందూ కాదని.. ఆలయ ధర్మం మంటకలిసిపోతుందని మండిపడుతున్నాయి.
పూసపాటి రాజవంశీయులు చేసిన కృషి : –
విజయనగరానికి విద్యల నగరంగా, కళలలకు అనధికార రాజధానిగా పేరు రావడానికి.. పూసపాటి రాజవంశీయులు చేసిన కృషే కారణం. విజయనగరం సంస్ధానం చివరి పట్టాభిషక్తులైన పీవీజీ రాజు, తన తండ్రి అలకనారాయణ గజపతి పేరున మాన్సాస్ ట్రస్టును ఏర్పాటు చేసి, విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎందరో విద్యావంతులను తీర్చిదిద్దిన ఘనత మన్సాస్ ట్రస్టుకుంది. అయితే ఇప్పుడీ ట్రస్టుతో పాటు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అప్పన్న దేవస్థానంలో రాజకీయ చిచ్చు రేగింది. మాన్సాస్ చైర్మెన్‌గా, అప్పన్న ఆలయ అనువంశిక ధర్మకర్తగా వున్న మాజీ మంత్రి అశోక గజపతి రాజుని ఆ పదవి నుంచి తొలగించి. సంచయితా గజపతిరాజును నియమించింది.
ఆనంద గజపతి రాజు మరణం తర్వాత :-
సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా అనువంశిక ధర్మకర్తగా ఉన్న పూసపాటి వంశీయులే కొనసాగడం సంప్రదాయంగా వస్తోంది. 1958లో పీవీజీ రాజు దీనిని ఏర్పాటు చేయగా.. ఆయన మరణం తర్వాత పెద్ద కుమారుడు ఆనంద గజపతిరాజు ఆ బాధ్యతలు చేపట్టారు. సుమారు 16 ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగారు. ఈ సమయంలో అశోక్ గజపతిరాజు ఏనాడూ ఆ పదవికి ఆశ పడకపోవడమే కాకుండా, తన వంశ సంప్రదాయాలను గౌరవిస్తూ వచ్చారు. సోదరుడు ఆనంద గజపతి రాజు మరణం తర్వాత మాత్రమే అనువంశిక ధర్మకర్తగా అశోక్ గజపతిరాజు బాధ్యతలు చేపట్టారు.
సంచయిత.. ఆనంద గజపతి రాజు మొదటి భార్య కుమార్తె :-
అయితే తాజాగా అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజును పక్కన బెట్టి.. ఆయన సొదరుడు ఆనంద గజపతి కుమార్తెను ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్‌గా నియమించడం వివాదాస్పదంగా మారింది. సంచయిత.. ఆనంద గజపతి రాజు మొదటి భార్య ఉమా కుమార్తె. కొన్ని కుటుంబ కారణాల రీత్యా అప్పట్లో ఆనంద గజపతి, ఉమాలు వేరుపడి, విడాకులు కూడా తీసుకున్నారు. కొంతకాలం తర్వాత ఆనంద్ గజపతి రెండో వివాహం చేసుకున్నారు.
రాజకీయం నడుస్తోందా :-
ఆనంద్ గజపతి, ఉమాల మధ్య విడాకుల తర్వాత విజయనగరం పూసపాటి వంశీయులకు, సంచయిత కుటుంబానికి ఎటువంటి సంబంధాలు కొనసాగలేదు. సంచితకు తన పిన తండ్రి అశోక్ గజపతి కుటుంబంతో కూడా ఎటువంటి సన్నిహిత సంబంధాలు లేవు. అయితే సడన్‌గా సంచయిత తెరమీదకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గజపతిరాజు అటు అప్పన్నదేవస్ధానం, ఇటు మాన్సాస్‌లకు చైర్మెన్‌గా రావడం వెనుక పెద్ద రాజకీయమే నడుస్తుందని టీడీపీ ఆరోపిస్తోంది.
అదితికి చెక్ పెట్టేందుకే : –
మరోవైపు అశోక్ గజపతి రాజు కుమార్తె అదితికి చెక్ పెట్టేందుకే.. వైసీపీ ఎప్పుడో ఈ ప్రాంతానికి దూరమైన ఆనంద గజపతి వారసులను తెర మీదకు తెచ్చారనే చర్చ సర్వత్రా సాగుతోంది. ప్రస్తుతం విజయనగరం సంస్థానంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో న్యాయ పోరాటం చేస్తామని టీడీపీ అంటోంది. మరోపక్క పూసపాటి రాజస్థానానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నారు.
విజయనగరంలో టీడీపీ నేతల ఆందోళన : –
విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. సింహాచలం దేవస్థానం ఆస్తుల పాటు.. విలువైన ట్రస్టు భూములను కొట్టేయడానికి ప్రభుత్వం స్కెచ్ వేసిందని టీడీపీ ఆరోపిస్తోంది. సంచయితను ట్రస్ట్ బోర్డ్ చైర్ పర్సన్‌గా తప్పించాలంటూ విజయనగరంలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అటు టీడీపీ నేతలు ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సంచయిత తెలిపారు.
Read More : ఏపీలో 25 జిల్లాలు..జగన్‌తో మాట్లాడా – కేసీఆర్