Vijayawada : విజయవాడలో వింత ప్రేమకథ
ట్యూషన్ పాయింట్ పెట్టుకుని ఇరువురు సహజీవనం చేశారు. ఇంటి యజమానికి ఇరువురు మగవారుగా పరిచయం చేసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ లో నాగేశ్వరరావు భ్రమరాంబికను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారు.

Strange love story
Vijayawada Strange Love Story : విజయవాడలో వింత ప్రేమకథ వెలుగుచూసింది. అమ్మాయిగా మారిన మగాడు.. మరో మగాడి చేతిలో మోసపోయాడు. విజయవాడలో నాగేశ్వరరావు, పవన్ అనే ఇద్దరు పురుషులు సుమారు ఆరు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు. పవన్ అవయవ మార్పిడి ఆపరేషన్ ద్వారా భ్రమరాంబికగా మారిపోయారు.
అవయవ మార్పిడి ఆపరేషన్ కు పవన్ రూ.11 లక్షలు ఖర్చు పెట్టారు. నాగేశ్వరావుని నమ్మి అతనికి పవన్ 11 సవర్ల బంగారం, 26 లక్షల నగదును ఇచ్చారు. 2019లో కృష్ణలంక సత్యం గారి హోటల్ సెంటర్ సమీపంలోని ఒక ఇంటిలో ఇరువురూ నివాసం ఉన్నారు.
ట్యూషన్ పాయింట్ పెట్టుకుని ఇరువురు సహజీవనం చేశారు. ఇంటి యజమానికి ఇరువురు మగవారుగా పరిచయం చేసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ లో నాగేశ్వరరావు భ్రమరాంబికను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారు.
తనతో ఉండవద్దంటూ భ్రమరాంబికను నాగేశ్వరరావు గెంటేశారు. దీంతో తను మోసపోయానని తెలుసుకున్న భ్రమరాంబిక పోలీసులను ఆశ్రయించారు. నాగేశ్వరరావు, అతని తల్లి విజయలక్ష్మిపై భ్రమరాంబిక ఫిర్యాదు చేశారు. ఈ వింత ప్రేమకథపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.