Vaccination drive: ఊరంతా వ్యాక్సిన్ వేయించిన మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రియల్ లైఫ్‌లో కూడా శ్రీమంతుడే. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న మహేష్‌బాబు.. లేటెస్ట్‌గా దత్తత తీసుకున్న తన తండ్రి స్వగ్రామం బుర్రిపాలెంలో ఊరు మొత్తానికి వ్యాక్సినేషన్ వేయించారు.

Vaccination drive: ఊరంతా వ్యాక్సిన్ వేయించిన మహేష్ బాబు

Vaccination Drive

Updated On : June 10, 2021 / 9:59 AM IST

Mahesh Babu Vaccination: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రియల్ లైఫ్‌లో కూడా శ్రీమంతుడే. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న మహేష్‌బాబు.. లేటెస్ట్‌గా దత్తత తీసుకున్న తన తండ్రి స్వగ్రామం బుర్రిపాలెంలో ఊరు మొత్తానికి వ్యాక్సినేషన్ వేయించారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కరోనా వ్యాధి సోకకుండా గ్రామంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం స్టార్ట్ చేశారు.

విజయవాడకు చెందిన ఆంధ్ర హాస్పిటల్స్‌తో ఒప్పందం చేసుకున్న మహేష్ బాబు.. వారం రోజుల పాటు ఊరి ప్రజలకు వ్యాక్సిన్ వేయించారు. బుర్రిపాలెం గ్రామంలో మొత్తం 12 వార్డులు ఉండగా రోజుకు రెండు వార్డులు చొప్పున మొత్తం 12 వార్డుల ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేయించారు. పది రోజుల వ్యవధిలో గ్రామంలో ఉన్నవారందరికీ ఫస్ట్ డోసు వ్యాక్సిన్ ఇచ్చేసినట్లు మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రమ్ ద్వారా వెల్లడించారు. ఈ కార్యక్రమం జూన్ 9న విజయవంతంగా పూర్తయ్యింది.

తన తండ్రి ఘట్టమనేని కృష్ణ పుట్టినరోజు నాడు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం మే 31న ప్రారంభించారు. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమాలో చేస్తున్నారు. ఇప్పటికే వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి వారి ఆనందానికి కారణం అయిన మహేష్.. సొంతూరిలో అందరికీ వ్యాక్సిన్ వేయించడంపై సోషల్ మీడియాలో నెటజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)