బెజవాడలో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం.. భారీ వర్షం

ఆకాశంలో మేఘాలు కమ్ముకుని ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో బెజవాడ వాసులకు ఉపశమనం లభించింది.

బెజవాడలో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం.. భారీ వర్షం

Updated On : May 9, 2024 / 12:33 PM IST

Vijayawada Rain: విజయవాడ నగరంలో గురువారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో మేఘాలు కమ్ముకుని ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. వాతావరణం చల్లబడడంతో వేసవి ఉక్కపోత నుంచి బెజవాడ వాసులకు ఉపశమనం లభించింది.

గత కొద్దిరోజులుగా మండుతున్న ఎండలతో విజయవాడ నగర ప్రజలు అల్లాడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. తాజాగా వర్షం పడడంతో వేడిమి గాలుల నుంచి నగర ప్రజలకు ఉపశమనం దక్కింది.

Also Read: ఎన్నికల వేళ జగ్గయ్యపేటలో భారీగా పట్టుబడిన డబ్బు.. రూ.8.39 కోట్ల నగదు స్వాధీనం

ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు రాజస్థాన్ నుంచి దక్షిణ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. తమిళనాడుపై సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉండడంతో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడతాయని.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది.