Undavalli Sridevi
Undavalli Sridevi : రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ను తాను దూషించినట్లుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. కొందరు వ్యక్తులు కావాలనే తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్ఫింగ్ చేసిన వీడియోలు ప్రసారం చేశారని వివరణ ఇచ్చారు. ఆ వీడియోలు చూసి ఎవరైనా మనస్తాపానికి గురై ఉంటే తనను క్షమించాలని ఉండవల్లి శ్రీదేవి కోరారు.
Sambrani : ఇంట్లో ధూపం ఎందుకు వేస్తారో తెలుసా?
మాదిగలకు హక్కులు అంబేద్కర్ వల్ల రాలేదని, బాబూ జగజ్జీవన్ రామ్ వల్ల వచ్చాయని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారంటూ విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉండవల్లి శ్రీదేవిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను బర్తరఫ్ చేయాలంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. శ్రీదేవి వ్యాఖ్యలను నిరసిస్తూ పలుచోట్ల అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకాలు చేశారు.
Tamarind Nuts : చింత గింజలతో ఆరోగ్య చింతలు దూరం
దీనిపై ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. ”అంబేద్కర్ పై నేను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. రాజ్యాంగ నిర్మాతను దూషించాననడం అవాస్తం. చిన్న నాటి నుంచి అంబేద్కర్ వాదినే. కొందరు ఉద్దేశపూర్వకంగా నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మార్ఫింగ్, ఎడిటింగ్ చేసిన వీడియోలను వైరల్ చేస్తున్నారు. వాటి వల్ల అంబేద్కర్ వాదుల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలి. అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ దళితులకు రెండు కళ్ల లాంటివారు. మార్ఫింగ్ వీడియోతో దుష్ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా” అని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు.