తిరుమల లడ్డూ వివాదంలో అసలు ఈ విషయం గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు?: తమ్మారెడ్డి
"ఇప్పుడు మీరు కొన్న నెయ్యిని టెస్ట్ చేయించారా? కనీసం ఇప్పుడు వస్తున్నది సరైనదా? లేదా చెక్ చేయించండి. ఇప్పుడైనా సరి చేయొచ్చు కదా" అని అన్నారు.
Tammareddy Bharadwaja
- ఇప్పుడు వస్తున్న నెయ్యిలో కల్తీ లేదా?
- ఏదైనా టెస్ట్ చేయించారా? లేదా?
- తక్కువ ధరకు నెయ్యిని కొంటున్నారు
Tammareddy Bharadwaja: హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి లడ్డూపై వివాదం చెలరేగుతుండడంపై సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయన 10టీవీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు.
“ఓ విషయం అర్థం కావట్లేదు. ఒకప్పుడు ఆ లడ్డూ తెచ్చి ఇంట్లో పెడితే ఆ ఘుమఘుమ వాసన ఇళ్లంతా వచ్చేది. డివైన్ ఫీలింగ్ వచ్చేది. ఆ లడ్డూ 10 రోజులైనా చెడిపోయేది కాదు. మనం స్వీట్ షాప్‌లో కొన్న లడ్డూ నాలుగు రోజులకే బూజు పట్టేస్తుంది.
నా క్వశ్చన్ ఏంటంటే ఆవు నెయ్యి మార్కెట్లో రూ.1,500గా ఉంది. అంటే ఒరిజినల్ నెయ్యి రూ.1,500 ఉంటే వీళ్లు రూ.300కో రూ.400కో రూ.500కో ఎలా కొంటున్నారు? గత ప్రభుత్వం ఫ్రాడ్ చేసిందని అనుకుందాం కొంతసేపు.
వీళ్లు రెగ్యులర్‌గా సప్లై చేస్తున్న వాళ్లే.. అంతకు ముందు సప్లై చేసిన వాళ్లు ఇప్పుడు సప్లై చేస్తున్న వాళ్లు ఒకరే. ఇప్పుడు కూడా ఆరు ట్రక్కులు లోడ్స్ పంపించాం అన్నారు. తర్వాత కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి.
ఆరు ట్రక్ లోడ్స్ రిటర్న్ వచ్చాయని, మళ్లీ వాడారని చెబుతున్నారు. అది నిజమా? ఎవరూ క్లారిటీగా చెప్పట్లేదు. అది నిజమైతే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా? ఇది ఎవరు చెప్పట్లేదు. అది నిజమా? అబద్ధమా కూడా ఎవరూ క్లారిఫై చేయట్లేదు.
ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 1,500 రూపాయలు ఉండే నెయ్యి రూ.400కో రూ.500కో ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు ఇస్తున్న దాంట్లో కల్తీ లేదని ఎట్లా చెబుతారు? ఏదైనా టెస్ట్ చేయించారా? చేయించలే.. రూ.1,500కు వచ్చే నెయ్యిని తక్కువ ధరకు ఇస్తున్నారంటే డెఫినెట్‌గా కల్తీ అయి ఉంటుంది.
నా పాయింట్ ఏంటంటే అసలు ఫస్ట్ ఈ నెయ్యిని టెస్ట్ చేయించండి. ఇప్పుడు వస్తున్న నెయ్యిని టెస్ట్ చేయించండి. పాత నెయ్యిని వదిలేయండి. 400 రూపాయలకు ఇప్పుడు కొంటున్నారు కదా? మీరు కొన్న నెయ్యిని టెస్ట్ చేయించారా? కనీసం ఇప్పుడు వస్తున్నది సరైనదా? లేదా చెక్ చేయించండి. ఇప్పుడైనా సరి చేయొచ్చు కదా” అని అన్నారు.
