జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు.. పవన్ పై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు..

టీడీపీ - జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా స్పందించారు.

జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు.. పవన్ పై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు..

Ambati Rambabu

Ambati Rambabu : టీడీపీ – జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ శనివారం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను తొలి జాబితాలో 118 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో టీడీపీ 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. జనసేన పార్టీ 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం కేవలం ఐదు నియోజకవర్గాల్లో బరిలో నిలిచే అభ్యర్థులను మాత్రమే పవన్ కల్యాణ్ ప్రకటించారు. మిగిలిన 19 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి జనసేన మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబోతుందని ఇరు పార్టీల అధినేతలు తెలిపారు.

Also Read : TDP-Janasena First List : 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ.. కేవలం ఐదు స్థానాలకే అభ్యర్థుల ప్రకటన.. ఎందుకంటే?

టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు పార్లమెంట్ నియోజకవర్గాలను కేటాయించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా స్పందించారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి అవమానం జరిగిందనే ఉద్దేశాన్ని అంబటి రాంబాబు వెలుబుచ్చారు. పల్లకి మోయడానికి తప్ప.. పావలా వంతుకుకూడా పనికిరావని తేల్చేశారు.. ఛీ అంటూ పవన్ కల్యాణ్ ను అంబటి ట్యాగ్ చేశారు.

Also Read : TDP-Jana Sena first list : టీడీపీ – జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. 94 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు వీరే ..