Rachamallu Siva Prasad Reddy : గత 3 సంవత్సరాలుగా నన్ను టార్గెట్ చేసి రాజకీయంగా బలహీనపర్చుతున్నారు : ఎమ్మెల్యే రాచమల్లు
తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా తనను టార్గెట్ చేశారని వాపోయారు. టీడీపీ నాయకులు ఏనాడు ప్రజల సమస్యలపై పోరాటం చేయలేదని విమర్శించారు.

MLA Rachamallu Siva Prasad Reddy
Rachamallu Siva Prasad Reddy – TDP Leaders : టీడీపీ నాయకులు గత మూడు సంవత్సరాలుగా ఒకే అంశంపై తనను టార్గెట్ చేసి, రాజకీయంగా బలహీన పర్చాలని ప్రయత్నిస్తున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ ఇంచార్జ్ ప్రవీణ్ కు వయసు, రాజకీయ అనుభవం లేదన్నారు. పెద్దాయన మాటలు సిగ్గుగా ఉన్నాయని.. సాక్షాలు, ఆధారాలతో విమర్శలు చేయాలని సూచించారు. బుధవారం కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.
Vishnukumar Raju : 2024లో అక్కడ నేనే ఎమ్మెల్యేని.. జగన్ అలా మాట్లాడి ఎవరిని మభ్యపెడుతున్నారు
యువగళం పాదయాత్ర సమయంలో ప్రవీణ్ ముందు ఉన్నాడు.. ఇప్పుడు పెద్దాయన 2వ రేస్ లో ఉన్నాడని, సురేష్ నాయుడు మొదటి రేస్ లో ఉన్నాడని తెలిపారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్ జిల్లా పరిస్థితులను అవగాహన చేసుకున్నారని పేర్కొన్నారు. నేర ప్రవృత్తి గల వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వటం సహజమేనని అన్నారు. జిల్లా వ్యాప్తంగా నేర ప్రవృత్తి గల వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారని తెలిపారు.
ప్రొద్దుటూరు నుండి అధిక స్థాయిలో మట్కా, క్రికెట్ బుకీలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారని వెల్లడించారు. దీన్ని పెద్దోడు భూతద్దంలో చూపించగా, చిన్నోడు ఏదో జరగబోతోందని మాట్లాడారు అని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు ప్రొద్దుటూరు, తానే బాస్ అని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాకు కొత్తగా ఏ ఎస్పీ వచ్చినా పరిపాటిగా కౌన్సిలింగ్ ఇవ్వటం సహజం అన్నారు.
Ambati Rambabu : ఆయన వల్లే టీడీపీ సర్వ నాశనం.. కాపాడటం ఎవరి వల్ల కాదు : మంత్రి అంబటి
తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా తనను టార్గెట్ చేశారని వాపోయారు. టీడీపీ నాయకులు ఏనాడు ప్రజల సమస్యలపై పోరాటం చేయలేదని విమర్శించారు. బాబు చేసిన ప్రయోజనాలు చూపి ప్రజలను ఓటు అడిగే అర్హత లేదన్నారు. పట్టీలు అందించె కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. 3 సంవత్సరాలుగా ప్రతిపక్షులు తనపై విష ప్రచారం చేస్తున్నాయని తెలిపారు.
మట్కా, గుట్కా, క్రికెట్ బెట్టింగ్ 2019 జూన్ నుండే వచ్చాయా, అంతకు ముందు లేవా అని ప్రశ్నించారు. 2004-09 వరకు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉందని, నాడు జూదం లేదా అని నిలదీశారు. మునిసిపల్ వైస్ చైర్మన్ ఖాజా నేడు క్రికెట్ బుకీ కాదా అని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యే టికెట్ కోసం మీ ఆరాటం చూస్తుంటే జాలి వేస్తోందన్నారు. ఏఎస్పీ ఎందుకు అసాంఘిక కార్యకలాపాలను ఆపలేదని, చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
Anil Kumar Yadav: తండ్రి కోసం ఎమ్మెల్యే సీటు వదులుకున్న కొడుకు.. ముషిరాబాద్ అసెంబ్లీ బరిలో అంజన్న!
జూద రహిత ప్రొద్దుటూరుగా నియోజకవర్గాన్ని చూడాలని ఉందని ఆకాంక్షించారు. మూడు నెలల్లో ప్రొద్దుటూరులో ఏటువంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటు ఉండకూడదు… అలా ఉంటే అందుకు కారణం పోలీసులేనని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించక పోతే ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు.