Harish Rao : నాపై విమర్శలు కాదు.. మీకు చేతనైతే విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదాపై పోరాడండి : ఏపీ మంత్రులకు హరీశ్ రావు కౌంటర్

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మాట్లాడితే..ఏపీ ప్రజలను కించపరిచేలా మాట్లాడానని ఏపీ మంత్రులు అంటున్నారని..ఏపీ ప్రజల పక్షాల మాట్లాడాను కానీ ఒక్కమాట కూడా అనలేదని స్పష్టం చేశారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు.

TS harish rao..AP Ministers

Harish Rao : నాపై విమర్శలు చేయటం కాదు మీకు చేతనైతే విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదాపై పోరాడండి అంటూ ఏపీ మంత్రులకు తెలంగాణ మత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మాట్లాడితే.. ఏపీ ప్రజలను కించపరిచేలా మాట్లాడానని ఏపీ మంత్రులు అంటున్నారని..ఏపీ ప్రజల పక్షాల మాట్లాడాను కానీ ఒక్కమాట కూడా అనలేదని స్పష్టం చేశారు హరీశ్ రావు. ఈ సందర్భంగా ఏపీ మంత్రులపై హరీశ్ రావు మండిపడ్డారు. ఏపీ మంత్రలు నాపై ఎగిరిపడటం మానేసి మీకు చేతనైతే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోమని.. ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా గురించి కేంద్రంపై పోరాడండీ అంటూ సవాల్ విసిరారు.

విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదా (AP Special Status) గురించి ఏపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని నేను ప్రశ్నిస్తే ఏపీ ప్రజలను కించపరిచేలా మాట్లాడానంటూ ఏపీ మంత్రులు టాపిక్ ను డైవర్ట్ చేసి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకి ఏపీ మంత్రలు నాపై విమర్శలు చేస్తు ఎగిరెగిరి పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

Pawan Kalyan : వైసీపీ నేతలూ.. తెలంగాణ ప్రజల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి : పవన్ కల్యాణ్

కాగా ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) విషయంలో ఏపీ తెలంగాణ నేతల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. అంతేకాదు టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా ఆవిర్భవించాక దేశ వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్న క్రమంలో ఏపీలో కూడా గులాబీ పార్టీ కాలుమోపాలనుకుంటోంది. ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ లో బీఆర్ఎస్ పాల్గొనలానుకోవటం వంటి పరిణామాలు కీలకంగా మారాయి. అలాగే బీఆర్ఎస్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయ లబ్ది కోసమే ఎత్తుగడలు వేస్తోందని మొదట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించి ఇప్పుడు బిడ్ వేస్తాననటంపై ఏపీ వైసీపీ(YCP) నేతలు గుర్రుగా ఉన్నారు.

రాజకీయ లబ్ది కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బీఆర్ఎస్ వాడుకోవాలని చూస్తోందంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో తెలంగాణ మంత్రులు కేటీఆర్ (KTR), హరీశ్ రావులు ఏపీ అభివృద్ధిపై కూడా సెటైర్లు వేశారు. దీంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ మంత్రులపై ముఖ్యంగా హరీశ్ రావుపై విమర్శలు చేశారు. ఏపీలో అభివృద్ది గురించి తెలుసుకోవాలంటే ఇక్కడకు రండి అంటూ సవాల్ విసిరారు. తెలంగాణలో ఏముంది అంటూ ఎదురు విమర్శలు సంధించారు. దానికి తెలంగాణలో ఏముందో తెలుసుకోవాలంటే ఏపీ మంత్రులు తెలంగాణ వస్తే చూపిస్తామంటే హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇలా వైసీపీ, బీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతున్న క్రమంలో మరోసారి హరీశ్ రావు(Harish Rao) స్పందిస్తు ఏపీ మంత్రులకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

Perni Nani : ఏపీని తిట్టిన మంత్రి తరపున కిరాయి మాటలు మాట్లాడుతావా? పవన్‌పై పేర్ని నాని ఫైర్