Vizag fishing harbor : మత్స్యకారుల ఆందోళన .. విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద ఉద్రిక్తత .. భారీగా పోలీసుల మోహరింపు

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కంటైనర్ టెర్మినల్‌ను దిగ్బంధించేందుకు మత్స్యకారులు యత్నించారు. హార్బర్ కు షిప్పులు వచ్చే మార్గంలో చేపల వేట బోట్లను నిలిపి మత్స్యకారులు ఆందోళన చేపట్టారు.

Vizag fishing harbor : మత్స్యకారుల ఆందోళన .. విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద ఉద్రిక్తత .. భారీగా పోలీసుల మోహరింపు

Tension at Visakha fishing harbor

Updated On : September 24, 2022 / 12:39 PM IST

Tension at Visakha fishing harbor : విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కంటైనర్ టెర్మినల్‌ను దిగ్బంధించేందుకు మత్స్యకారులు యత్నించారు. హార్బర్ కు షిప్పులు వచ్చే మార్గంలో చేపల వేట బోట్లను నిలిపి మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. పోర్టు నిర్మాణ సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కంటైనర్ టెర్మినల్ మెయిన్ గేటు వద్దకు కూడా మత్స్యకారులు భారీగా చేరుకుని నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనటంతో పోలీసులు భారీగా మోహరించారు.

మత్స్య పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో పోర్టులో నిర్మాణంలో ఉన్న క్రూయిజ్ టెర్మినల్ లో స్థానిక మత్స్యకారులకు ఉద్యోగాలను కల్పించడంతో పాటు, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జాలర్లు డిమాండ్ చేస్తున్నారు. 1933లో ఓడరేవు నిర్మాణానికి తమ పూర్వీకులు భూమి ఇచ్చారని విశాఖ పోర్ట్ అథారిటీ ఛైర్మన్ కు ఇచ్చిన వినతిపత్రంలో సంఘం నాయకులు గుర్తు చేశారు. గతంలో తమకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు జనరల్ కార్గో బెర్త్ ప్రధాన ద్వారం ముందు మత్స్యకారులు బైఠాయించి… హార్బర్ లోపలకు, బయటకు వాహనాలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో..ఆ ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.