Tension In Kadiri : మొన్న గన్నవరం, నిన్న బేతంచర్ల, నేడు కదిరి.. టెన్షన్ టెన్షన్..

సత్యసాయి జిల్లా కదిరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లలో భాగంగా ఆలయం చుట్టుపక్కల ఉన్న దుకాణాలు తొలగించేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు.

Tension In Kadiri : మొన్న గన్నవరం, నిన్న బేతంచర్ల, నేడు కదిరి.. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. సై అంటే సై అంటున్నారు. దాడులు, ప్రతి దాడులతో టెన్షన్ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. ఈ ఘర్షణలతో ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

తాజాగా సత్యసాయి జిల్లా కదిరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లలో భాగంగా ఆలయం చుట్టుపక్కల ఉన్న దుకాణాలు తొలగించేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ రంగంలోకి దిగారు. దుకాణాలను తొలగించకుండా మున్సిపల్ అధికారులను ఆయన అడ్డుకున్నారు. దీంతో వివాదం రేగింది. ఈ వ్యవహారం టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణకు దారితీసింది. సీఐతో వాగ్వాదానికి దిగారు మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్. ఇరువర్గాలు చెన్నై హైవేపై బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Also Read..Gannavaram High Tension : గన్నవరంలో హైటెన్షన్.. టీడీపీ ఆఫీస్‌పై దాడి, కారుకి నిప్పు

టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట, రాళ్ల దాడి జరిగింది. కర్రలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో కొందరు టీడీపీ శ్రేణులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘర్షణ గురించి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరోవైపు విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలి వచ్చారు. గాయపడ్డ తమ పార్టీ వారిని పరామర్శించారు.

కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం ఆలయం చుట్టూ మున్సిపాలిటీ స్థలంలో పెట్టుకున్న చిన్న చిన్న దుకాణాలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దుకాణాలను తొలగించడాన్ని ఆయన అడ్డుకున్నారు. దుకాణాలే వారి జీవనాధారం అని, ఆ దుకాణాలు తీసేస్తే వారి ఎలా బతుకుతారని కందికుంట ప్రసాద్ నిలదీశారు.

Also Read..Google Takeout : వైఎస్ వివేకా కేసులో కీలకంగా మారిన గూగుల్ టేకౌట్.. అసలేంటీ గూగుల్ టేకౌట్? ఎలా యూజ్ అవుతుంది?

సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ గుమిగూడిన టీడీపీ శ్రేణులను చెదరగొట్టారు. ఈ క్రమంలో సీఐ మధు, టీడీపీ మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ మహిళను సీఐ మధు అసభ్యపదజాలంతో దూషించారని గొడవ జరిగింది. ఈ సాయంత్రం టీడీపీ మహిళా సంఘం నాయకులు సీఐ ఇంటి ముట్టడికి యత్నించారు. విషయం తెలుసుకున్న వైసీపీ వర్గాలు.. సీఐకి మద్దతుగా రంగంలోకి దిగాయి. టీడీపీ శ్రేణులకు వ్యతిరేకంగా చెన్నై హైవే పై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట, రాళ్ల దాడి జరిగింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.