Private Hospitals: ఏపీలో ఆ వైద్య సేవలు బంద్..! ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ కీలక నిర్ణయం..

అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ వాపోయింది.

Private Hospitals: ఏపీలో ఆ వైద్య సేవలు బంద్..! ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ కీలక నిర్ణయం..

Updated On : September 15, 2025 / 6:12 PM IST

Private Hospitals: ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందించే ఓపీడీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన రూ.2వేల 500 కోట్ల బకాయిలు విడుదల చేయకపోవడంపై అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశామని, అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ వాపోయింది.

ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందించే ఓపీడీ సేవలు నిలిపివేతకు సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ ఇబ్బందికరంగా మారిందని వాపోయింది. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని లేఖలో కోరింది. ఇప్పటికే సామర్థానికి మించి సేవలు అందించామని తెలిపింది. బకాయిలు ఇవ్వలేని నేపథ్యంలో ఎన్టీఆర్ వైద్య సేవల ఓపీడీని కొనసాగించలేమని ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ తేల్చి చెప్పింది. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని లేఖలో విజ్ఞప్తి చేసింది.

అటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎల్లుండి నుంచి అక్కడ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. బకాయిలు చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నట్లు నెట్ వర్క్ హాస్పిటల్స్ ప్రకటించాయి. 12 నెలలకు సంబంధించి 1400 కోట్ల బకాయిలు చెల్లించాలని నెట్ వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 330 ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. 22 నెలలుగా EHS, JHS బకాయిలు ఇవ్వలేదని నెట్ వర్క్ ఆసుపత్రులు ఆరోపించాయి.

Also Read: యూరియాతో క్యాన్సర్..! సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. రైతులకు అవగాహన కల్పించాలని సూచన..