Gudivada Amarnath : దసరాకు విశాఖ ప్రజల కోరిక తీరబోతుంది, జగన్‌ను సీఎంగా చూడాలనుకున్న వారికి అన్యాయం జరగదు

దసరాకు పార్టీ నాయకత్వం కోరుకుంటున్న శుభపరిణామం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి అన్యాయం చేసిన నలుగురు ఎమ్మెల్యేలపై వేటేసిన ధైర్యం జగన్ మోహన్ రెడ్డిది అని అన్నారు. Gudivada Amarnath

Gudivada Amarnath - Visakhapatnam

Gudivada Amarnath – Visakhapatnam : విశాఖ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా కోలా గురువులు బాధ్యతలు స్వీకరించారు. ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ నాథ్, మాజీమంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ విశాఖకు రాకపై మంత్రి అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దసరాకు ముఖ్యమంత్రి జగన్ విశాఖకు వస్తున్నారని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు మంత్రి అమర్నాథ్. దసరాకు ఈ ప్రాంతం ప్రజల కోరిక తీరబోతుంది అని ఆయన చెప్పారు. దసరాకు పార్టీ నాయకత్వం కోరుకుంటున్న శుభపరిణామం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి అన్యాయం చేసిన నలుగురు ఎమ్మెల్యేలపై వేటేసిన ధైర్యం జగన్ మోహన్ రెడ్డిది అని మంత్రి గుడివాడ అన్నారు.

Also Read..Avanthi Srinivas: భీమిలిలో అవంతి శ్రీనివాస్‌కు పరిస్థితులు అనుకూలంగా లేవా.. సీటు మారుస్తారా?

అవకాశాల కోసం వచ్చిన వాళ్లే పార్టీ వదిలి వెళ్లిపోయారని మంత్రి గుడివాడ విమర్శించారు. ముందు నుంచి పార్టీ కోసం పని చేసిన వాళ్లకు, జగన్ ని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకున్న వాళ్ళకు అన్యాయం జరగదని మంత్రి గుడివాడ్ అమర్నాథ్ స్పష్టం చేశారు.

వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్..
వైసీపీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగదు. దీనికి నిదర్శనం కోలా గురువులే. చట్టసభలో కూర్చోబెడతానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. చంద్రబాబు కుట్రలతో గురువులు ఓడిపోయారు. మత్స్యకారుడిని రాజ్యసభకు పంపిన చరిత్ర జగన్ ది. సీఎం జగన్ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పరిపాలన రాజధానికి అధ్యక్షుడిగా గురువులను సీఎం జగన్ నియమించారు. కచ్చితంగా గురువులను చట్టసభలో సీఎం జగన్ కూర్చోబెడతారు.

Also Read..Ambati Rambabu : కాస్కో బ్రో.. ఢిల్లీకి వెళ్తున్నా, ఆయనతో చర్చించాక ఎవరికి ఫిర్యాదు చేస్తామో చెప్తా- అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు

కోలా గురువులు, విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కామెంట్స్..
నాకు జిల్లా అధక్షుడిగా బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్ కు ధన్యవాదాలు. నాకు ఇస్తానని మాట ప్రకారం ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. చంద్రబాబు కుట్ర వలన నేను ఎమ్మెల్సీగా ఓడిపోయాను. జిల్లా, డీసీసీబీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్ కు ధన్యవాదాలు.