బాలికపై ఏడాది నుంచి ముగ్గురు సామూహిక అత్యాచారం

విశాఖపట్నం జిల్లాలో కామాంధుల అఘాయిత్యానికి మరో పసిమొగ్గ జీవితం బలైపోయింది. యలమంచిలి మండలం కొత్తల్లిలో ఓ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. గత సంవత్సర కాలం నుంచి జరుగుతున్న ఈ దారుణానికి 15ఏళ్ల బాలిక నరక యాతన అనుభవించింది. కామంతో ఆ బాలికపై దారుణాతిదారుణంగా పశువుల్లా ప్రవర్తిస్తూ సంవత్సరం నుంచి హింసలకు గురిచేశారు ముగ్గురు కామాంధులు.
సంవత్సరం నుంచి ఆ ముగ్గురు చేస్తున్న అత్యాచారానికి ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది. బాలిక గర్భం దాల్చిన విషయాన్ని బామ్మ గుర్తించటంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక నానమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే..కొత్తలి గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో నాయనమ్మ, తాతయ్య వద్ద ఉంటోంది. తొమ్మిదో తరగతి వరకూ చదివి మానేసి ఇంట్లోనే ఉంటోంది. నాయనమ్మ, తాతయ్యలు రోజూ కూలిపనుల కోసం ఉదయం వెళ్లి రాత్రికి తిరిగొస్తారు. దీంతో బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఆమెపై కన్నేశారు.
దీంట్లో భాగంగా ఆ ముగ్గురు యువకులు రోజు ఆమె దగ్గరు వచ్చేవారు. చనువు పెంచుకుంటూ మాయమాటలు చెప్పి దగ్గరయ్యారు. అలా సంవత్సరం నుంచి ఆమెను బెదిరిస్తూ శారీరకంగా లొంగదీసుకుని లైంగిక కోరికలు తీర్చుకుంటున్నారు. దీంతో బాధితురాలు గర్భం దాల్చింది. ఆమె శరీరంలో మార్పులు గమనించిన నాయనమ్మ తుని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా…ఆరు నెలల గర్భవతి అని డాక్టర్ చెప్పడంతో నాయనమ్మ షాకైంది.
దీంతో ఏం జరిగిందని బాలికను ప్రశ్నించింది.కానీ భయంతో నోరు విప్పలేదు. గట్టిగా అడిగినా ఏడ్చింది తప్ప ఏమీ చెప్పలేదు. దీంతో నానమ్మ మనుమరాలు భయపడటంతో అనునయించి అడగటంతో అసలు విషయం చెప్పింది. నిందితుల్లో ఒకరు పెయింటర్, మరొకరు వ్యవసాయ కూలీ, మూడో వ్యక్తి భవన నిర్మాణ కార్మికుడని తేలింది. దీంతో నానమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో యలమంచిలి పోలీసులు ఆదివారం (జులై 5,2020) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Read Here>>పిన్నితో వివాహేతర సంబంధం, వేరొకరితో చనువుగా ఉంటోందని హత్య