TDP Office Attacked : గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ ఆఫీస్ పై దుండగుల దాడి.. కార్లు, ఫర్నీచర్ ధ్వంసం
అయితే రాత్రి అక్కడ నియోజకవర్గం విస్త్రతస్థాయి సమావేశాన్ని యార్లగడ్డ వెంకట్రావు నిర్వహించారు. సభ విజయవంతం అవ్వడం చూసి ఓర్వలేకే దాడి చేశారని టీడీపీ నేతలు అంటున్నారు.

TDP Office Attacked at Gannavaram: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం ప్రసాదంపాడులోని టీడీపీ ఆఫీస్ పై దుండగులు దాడికి పాల్పడ్డారు. కార్లు, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ప్రసాదంపాడులోని టీడీపీ నేత సరసయ్య స్వంత స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలాయన్ని ఏర్పాటు చేశారు.
అయితే రాత్రి అక్కడ నియోజకవర్గం విస్త్రతస్థాయి సమావేశాన్ని యార్లగడ్డ వెంకట్రావు నిర్వహించారు. సభ విజయవంతం అవ్వడం చూసి ఓర్వలేకే దాడి చేశారని టీడీపీ నేతలు అంటున్నారు. రాత్రి 3 గంటల సమయంలో బండరాళ్లు, ఇనుప రాడ్లతో సామాగ్రిని పగల గొట్టారని టీడీపీ నేతలు చెప్పారు.