CM Jagan : అర్చకుల కుటుంబాల్లో వెలుగులు నింపిన జగన్ కలకాలం సీఎంగా ఉండాలి

అర్చకులకు వంశపార్యంపర హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంపై సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు వంశపార్యంపర హక్కులను కల్పిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు.

CM Jagan : అర్చకుల కుటుంబాల్లో వెలుగులు నింపిన జగన్ కలకాలం సీఎంగా ఉండాలి

Srivari Temple Priests Thanks To Cm Ys Jagan

Updated On : March 29, 2021 / 10:24 AM IST

CM Jagan : అర్చకులకు వంశపార్యంపర హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంపై సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు వంశపార్యంపర హక్కులను కల్పిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. జగన్ నిర్ణయంపై ఏపీ అర్చక సమాఖ్య కూడా హర్షం వ్యక్తం చేసింది.

ఇటీవల 10మంది అర్చకులు రిటైర్ కాగా, వారి స్థానంలో వారి కుటుంబాలకే చెందిన అర్హత ఉన్న 10మందికి ఉద్యోగాలు ఇవ్వడ్డానికి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చాలా సంతోషకరం అని తెలిపారు అర్చకులు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యను జగన్ పరిష్కరించారని, అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపారని, ఆయనే కలకాలం సీఎంగా ఉండాలని అర్చకులు కోరుకున్నారు.

2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అర్చకులకు వంశపార్యంపర హక్కుల చట్టాన్ని తీసుకొచ్చారు. దీనిపై అర్చక సమాఖ్య ఎన్నోసార్లు గత ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా స్పందించలేదు. పాదయాత్ర సమయంలో అర్చకులు జగన్ ను కలిశారు. తమ సమస్యలను విన్నవించారు. దీనిపై స్పందించిన ఆయన ఎన్నికల సమయంలో అర్చకులకు వంశపార్యంపర హక్కులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో చేర్చారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక కూడా తమ పని జరగకపోవడంతో ఇటీవలే సీఎం జగన్ ను కలిసిన ఏపీ అర్చక సమాఖ్య మరోమారు గుర్తు చేసింది. దీంతో సీఎం జగన్ వెంటనే నిర్ణయం తీసుకున్నారు.