Tiruchanuru : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ
నవంబర్ 10వ తేదీ ధ్వజారోహణంతో శ్రీపద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. 14వ తేదీ అమ్మవారు గజవాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారని వెల్లడించారు.

Tiruchanuru Sri Padmavati Ammavariu
Tiruchanuru Sri Padmavati Ammavaru : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల బ్రోచర్ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబరు 10 నుంచి 18వ తేదీ వరకు తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 7వ తేదీ అంకురార్పణ, 9వ తేదీ లక్ష కుంకుమ పూజ నిర్వహణ ఉండనున్నట్లు పేర్కొన్నారు.
నవంబర్ 10వ తేదీ ధ్వజారోహణంతో శ్రీపద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. 14వ తేదీ అమ్మవారు గజవాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారని వెల్లడించారు. 18వ తేదీ పంచమి తీర్థం ఉంటుందని తెలిపారు. 9 కోట్ల రూపాయలతో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పుష్కరిణీని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
శరవేగంగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. కాశీమఠం పీఠాధిపతి సమయమింద్ర తీర్థ స్వామి తిరుమల శ్రీవారికి కాసుల హారం కానుకగా ఇవ్వనున్నారు. రూ. 49 లక్షల విలువైన 60 డాలర్లు ఉన్న కాసుల హారాన్ని రేపు(మంగళవారం) శ్రీవారికి కానుకగా ఇవ్వనున్నారు.