Tirumala : మూడంచెల సెక్యూరిటీ, చిన్న పిల్లలకు జియో ట్యాగింగ్.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత

తిరుమలలో 32 పార్కింగ్ ప్రాంతాల్లో 15వేల వాహనాలు పట్టే విధంగా పార్కింగ్ ఏర్పాటు. తిరుమల మాఢ వీధి గ్యాలరీలో లక్ష 20 వేల మందికి మాత్రమే సామర్థ్యం. Tirumala

Tirumala : మూడంచెల సెక్యూరిటీ, చిన్న పిల్లలకు జియో ట్యాగింగ్.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత

Tirumala Brahmotsavam (Photo : Facebook)

Updated On : October 18, 2023 / 12:18 AM IST

Tirumala Brahmotsavam : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపారు. 1800 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. గరుడ సేవ రోజు 1,253 మంది పోలీసులు అదనంగా బందోబస్తు నిర్వహిస్తారన్నారు. ఈ నెల 19న గరుడ వాహన సేవ కు పటిష్టమైన బందోబస్తు కల్పిస్తామన్నారు. గరుడ సేవ రోజున 3లక్షలు మంది భక్తులు వస్తారని అంచనా వేశారు.

”అలిపిరి వద్ద ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం. బయట ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే భక్తులకు ప్రత్యేక పార్కింగ్. 19వ తేదీ ఉదయం 6 గంటలు నుంచి మరుసటి రోజు అంటే 20వ తేదీ ఉదయం 6 గంటలు వరకు ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు. తిరుమలలో 32 పార్కింగ్ ప్రాంతాల్లో 15వేల వాహనాలు పట్టే విధంగా పార్కింగ్ ఏర్పాటు. తిరుమల మాఢ వీధి గ్యాలరీలో లక్ష 20 వేల మందికి మాత్రమే సామర్థ్యం.

Also Read : అమ్మవారి చేతుల్లో ఉన్న ఆయుధాలు దేనికి సంకేతమో తెలుసా?

గరుడ వాహనం సమయంలో మాఢ వీధుల్లోకి వెళ్ళే విధంగా 5 క్యూ లైన్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. భక్తులు సంయమనం పాటించాలి. చిన్న పిల్లలకు జియో ట్యాగింగ్ విధానం అందుబాటులో ఉంటుంది. తిరుపతి నగరంలో గరుడ వాహన సేవ రోజున ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తాం. వాహనాల మళ్లింపు, నిర్దేశించిన పార్కింగ్ లో వాహనాలు నిలపాలి. నడక మార్గంలో వెళ్ళే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తాం’ అని ఎస్పీ పరమేశ్వర రెడ్డి వెల్లడించారు.