రాష్ట్రపతి పర్యటనలో ప్రోటోకాల్ అధికారికే అవమానం..

TTD Vigilance officials prevented Chittoor District Collector : భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటనలో ప్రోటోకాల్ అధికారికే అవమానం జరిగింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ కుమార్ గుప్తాకు తిరుమలలో చేదు అనుభవం ఎదురైంది. ఆలయంలోకి వెళ్లేందుకు బయోమెట్రిక్ దగ్గరకు వెళ్లిన జిల్లా కలెక్టర్ ను టీటీడీ విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ అని చెబుతున్నా వారు పట్టించుకోలేదు. లోపలికి వెళ్లేందుకు విజిలెన్స్ అధికారులు అనుమతించలేదు. తర్వాత తప్పు తెలుసుకున్న అధికారులు కలెక్టర్ ను లోపలికి తీసుకెళ్లారు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భరత్ కుమార్ గుప్తాకు చేదు అనుభవం ఎదురైంది. రామ్ నాథ్ కోవింద్ దంపతులు మహా ద్వారా ఆలయం లోపలికి వెళ్లేటప్పుడు అక్కడున్న అర్చకులు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అదేవిధంగా ఈవో జవహర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికి లోపలికి ఆహ్వానిస్తున్నారు.
ఆ సమయంలోనే జిల్లా కలెక్టర్ ను లోపలికి వెళ్లనివ్వకుండా గేట్లు మూసి వేశారు. అయితే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కాస్తా మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
https://10tv.in/bjp-leader-bandi-sanjay-controvercial-comments-on-patahabasthi/
ఆ తర్వాత బయోమెట్రిక్ (ఎంప్లాయిస్ అందరూ లోపలికి వెళ్లే మార్గంలో) ద్వారా వెళ్లాలని ప్రయత్నం చేసినప్పటికీ అక్కడున్నటీటీడీ విజిలెన్స్ అధికారులు కలెక్టర్ ను అని చెబుతున్నప్పటికీ లోపలికి అనుమతించలేదు. దీంతో చేదుఅనుభవం ఎదుర్కొన్న నారాయణ గుప్తా వెనక్కి వచ్చి కాస్తా దూరం నడుచుకుంటూ వెళ్లి ఫోన్ లో మాట్లాడటం కనిపించింది. ఆ తర్వాత లోపలి నుంచి సమాచారం రావడంతో దగ్గరగా ఉన్న అధికారులు, తిరుపతి అడిషనల్ ఎస్పీ సుప్రజా ఆయన్ను లోపలికి తీసుకెళ్లారు.
చిత్తూరు జిల్తా కలెక్టర్ గా ప్రోటోకాల్ ఉంటుంది. రాష్ట్రపతి గానీ, ప్రధాని గానీ ఎవరైనా ప్రముఖులు వచ్చినప్పుడు ఎయిర్ పోర్టు నుంచే స్వాగతం పలికి బస ఏర్పాట్లు, శ్రీవారి ఆలయంలో దర్శనం, వారి పర్యటనకు సంబంధించి ఇతర కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ ముందుండి జరిపిస్తారు.
అయితే శ్రీవారి ఆలయం వద్ద కాస్తా సమన్వయం లోపం కారణంగా ఆయన వెనుక ఉండటం, ఆ తర్వాత లోపలికి అనుమతించకుండా మహా ద్వారం గేట్లను మూసివేయడం, అనంతరం అక్కడి నుంచి బయోమెట్రిక్ ద్వారా ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ కూడా విజిలెన్స్ అధికారులు డ్డుకోవడంతో కలెక్టర్ కాస్తా మనస్తాపానికి గురయ్యారు. సమచారం లోపం కారణంగా ఇలా జరిగినట్లు తెలుస్తోంది.