ఆ ఇద్దరి వల్లా గర్భంవచ్చిందా?అయితే పెళ్లి చేసేద్దాం..ఓ పనైపోతుంది..పోలీసుల ఎంట్రీతో రచ్చ…

two brothers love affair with two minor girls and they get pregnancy: అమ్మాయిలంటే ఆటబొమ్మలా ఆడుకుంటున్నారు కామాంధులు..మరోపక్క ప్రేమ పేరుతో అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటామని మన్మించి గర్భం చేసి వదిలించుకుంటున్నారు.అలా ప్రేమ పేరుతో ఇద్దరు బాలికల్ని ఇద్దరు అన్నదమ్ములు శారీరకంగా వాడుకున్నారు. తరువాత వారు గర్భం దాల్చాక పత్తాలేకుండాపోయారు. దీంతో బాధిత బాలికలిద్దరూ గ్రామంలోని కుల పెద్దలకు తమ గోడు వెళ్లబోసుకున్నారు.దీంతోవారు.. అయితే పెళ్లి చేసేద్దాం..ఓ పనైపోతుంది అంటూ.. బాలికల (మైనర్లు) తోనే పెళ్లి చేయటానికి ఏర్పాట్లు చేశారు.
వారిలో ఒక జంటకు అప్పటికే పెళ్లి చేసి.. మరో జంటకు పెళ్లి చేసేందుకు ప్రయత్నించగా.. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నన్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తిరుమలం పాలెంలో జరిగింది.
తిరుమలంపాలెం ఎస్సీ కాలనీకి చెందిన 16,17 ఏళ్ల ఇద్దరు బాలికలు అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు అన్నదమ్ములు తమను ప్రేమ పేరుతో మోసం చేసి.. శారీరంగా అనుభవించారని ఆరోపించారు. ఫలితంగా తామిద్దరం గర్భవతులమయ్యామని..ఇప్పుడు వారిద్దరూ మాకు..మీకు ఏం సంబంధం లేదంటున్నారనీ.. మాకు న్యాయం చేయమని వేడుకున్నారు.
దీనిపై గత ఆదివారం (సెప్టెంబర్27,2020) రాత్రి ఎస్సీ కాలనీలోని రామాలయం వద్ద పంచాయతీ పెట్టారు. బాలికలకు అన్యాయం జరిగిందని తీర్పు ఇచ్చిన పెద్దలు.. వారి గర్భానికి కారణమైన యువకులతోనే వివాహం చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా అదే రోజు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అన్నాదమ్ముల్లో చిన్నవాడైన 17 ఏళ్ల యువకుడికి.. 7 నెలల గర్భంతో ఉన్న బాలికతో పెళ్లి జరిపించారు.
మరునాడు సోమవారం ఉదయం అన్నకు, 8 నెలల గర్భంతో ఉన్న మరో బాలికకు వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ బాల్య వివాహాలపై కొందరు గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేయటంతో వెంటనే పోలీసులు రామాలయం వద్ద జరుగుతున్న వివాహాన్ని అడ్డుకున్నారు.గ్రామ పెద్దలతో పాటు ఆ అన్నాదమ్ములు..బాలికలను కౌన్సెలింగ్ ఇచ్చి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ క్రమంలో కుల పెద్దలు, అమ్మాయిల తరపు బంధువులు తమను ఉద్దేశ్వపూర్వకంగా ఇరికిస్తున్నారని సదరు అన్నదమ్ముల తల్లిదండ్రులు పోలీసుల ముందు వాపోయారు. సదరు యువకుల తోటకే మైనర్ బాలికలు పనికి వెళ్లే వారని..వారితో శారీరక సంబంధం పెట్టుకొని ఉండవచ్చని కొందరు గ్రామస్తులు అంటున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఇరు కుటుంబాలు, కుల పెద్దలు రాజీకి యత్నించారు. గ్రామంలో మరోసారి చర్చించుకొని.. పోలీస్ స్టేషన్‌కు వస్తామని చెప్పి వెళ్లిపోయారు.