Ukraine Crisis : క్షేమంగా తీసుకొచ్చినందుకు సీఎం జగన్‌‌కు ధన్యవాదాలు

ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయానికి మరో నలుగురు తెలుగు విద్యార్థులు చేరుకున్నారు. ఉక్రెయిన్ లోని రుమేనియా నుండి ఢిల్లీ చేరుకొని అక్కడ నుండి గన్నవరం విమానాశ్రయానికి తీసుకొచ్చారు.

Ukraine Crisis : క్షేమంగా తీసుకొచ్చినందుకు సీఎం జగన్‌‌కు ధన్యవాదాలు

Gannavaram Airport

Updated On : March 3, 2022 / 10:09 AM IST

Gannavaram Airport : ఉక్రెయిన్ దేశంపై రష్యా చేపడుతున్న యుద్ధం ఇంకా కొనసాగుతోంది. రాకెట్లు, క్షిపణులతో రష్యా చేపడుతున్న విధ్వంసానికి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఉక్రెయిన్ దేశాన్ని విడిచి చాలా మంది ఇతర దేశాలకు వలసలు వెళ్లిపోతున్నారు. మరెంతో మంది అక్కడ చిక్కుకున్నారు. అందులో భారతీయులు కూడా ఉన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం వారిని సురక్షితంగా భారతదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకొంటోంది. ఆపరేషన్ గంగను వేగంవంతం చేసింది. తెలుగు విద్యార్థులను తీసుకొచ్చేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చర్యలు చేపడుతున్నాయి. వారు క్షేమంగా రావడంతో కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు.

Read More : AP Students in Ukraine : ఏపీ విద్యార్థుల కోసం యుక్రెయిన్ సరిహద్దులకు ప్రతినిధుల బృందం..!

2022, మార్చి 03వ తేదీ గురువారం ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయానికి మరో నలుగురు తెలుగు విద్యార్థులు చేరుకున్నారు. ఉక్రెయిన్ లోని రుమేనియా నుండి ఢిల్లీ చేరుకొని అక్కడ నుండి గన్నవరం విమానాశ్రయానికి తీసుకొచ్చారు. ఇక్కడకు వచ్చిన వారిలో విజయవాడకు చెందిన ఏ.మేరీమంజరి, పి.విహారి, తెనాలికి చెందిన షేక్ రేష్మ, కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం శోభనాపురంకు చెందిన నరసింహారావులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున విద్యార్థులకు స్వాగతం రెవిన్యూ అధికారులు స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయంలో విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రభుత్వ వాహనాల్లో విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపారు.

Read More : Iranian People : యుక్రెయిన్-రష్యా వార్.. బైడెన్ టంగ్ స్లిప్.. ట్రెండింగ్‌లో #ఇరానియన్‌.. హ్యాష్ ట్యాగ్!

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ఉక్రెయిన్ నుండి బోర్డర్ దాటేందుకు చాలా ఇబ్బందులు పడ్డామని వైద్య విద్యార్థులు తెలిపారు. చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నట్లు, ఇంటికి చేరుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కృషి చేశాయని ప్రశంసించారు. ఇంటికి వస్తామో లేదో అనే భయం మధ్య ఇప్పటి వరకు గడిపినట్లు, గన్నవరం విమానాశ్రయంలో తల్లిదండ్రులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఢిల్లీ నుండి ఇంటికి చేర్చే వరకు కేర్ తీసుకున్న సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు, ఇండియా ఫ్లాగ్ పట్టుకొని బోర్డర్ దాటడం కొద్దిగా సులువుగా ఉందన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఉన్న విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. మిగిలిన విద్యార్థులను కూడా త్వరగా స్వదేశానికి తీసుకురావాలని కోరారు. అక్కడ ఉన్న పరిస్థితులు టీవీల్లో చూసి చాలా భయపడ్డినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు వ్యాఖ్యానించారు. తమ పిల్లలు వచ్చేవరకు ఎంతో భయంతో గడిపామన్నారు. త్వరగా ఇంటికి చేరుకోవడం ఆనందంగా ఉందని,
అందుకు కృషి చేసిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు.