Iranian People : యుక్రెయిన్-రష్యా వార్.. బైడెన్ టంగ్ స్లిప్.. ట్రెండింగ్‌లో #ఇరానియన్‌.. హ్యాష్ ట్యాగ్!

Biden Iranian People : ఒకవైపు యుక్రెయిన్‌, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రష్యా దురాక్రమణ చర్యలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా మండిపడ్డారు.

Iranian People : యుక్రెయిన్-రష్యా వార్.. బైడెన్ టంగ్ స్లిప్.. ట్రెండింగ్‌లో #ఇరానియన్‌.. హ్యాష్ ట్యాగ్!

Russia Ukraine War Why ‘iranian People’ Is Trending On Twitter After Joe Biden’s Sotu 2022 Speech

Biden Iranian People : ఒకవైపు యుక్రెయిన్‌, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రష్యా దురాక్రమణ చర్యలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా మండిపడ్డారు. రష్యాకు సంబంధించిన విమానాలపై ఆంక్షలు విధించారు. అమెరికాలో గగనతలంలోకి రష్యా విమానాలకు ప్రవేశించకుండా నిషేధం విధించారు.

రష్యా చర్యలను వ్యతిరేకించిన ఆయన యుక్రెయిన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా బైడెన్ ఒక్కసారిగా టంగ్ స్లిప్ అయ్యారు. యుక్రెయిన్ ప్రజలు అనబోయి ఇరానియన్ ప్రజలు అని సంబోధించారు. అంతే.. ఆయన పొరపాటున పలికిన పదం ఇప్పుడు ట్విట్టర్ #Iranian అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది.

ఇటీవల యుక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలపై జో బైడెన్‌ కాంగ్రెస్‌ ఉభయ సభలనుద్దేశించి తొలి స్టేట్‌ ఆఫ్‌ యూనియన్‌లో ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. యుక్రెయిన్‌ను ఆక్రమించినా గెలిచినా.. ఆ దేశ ప్రజల హృదయాలను మాత్రం పుతిన్‌ ఎప్పటికీ గెలుచుకోలేరని బైడెన్‌ వ్యాఖ్యానించారు.

Russia Ukraine War Why ‘iranian People’ Is Trending On Twitter After Joe Biden’s Sotu 2022 Speech (1)

Russia Ukraine War Why ‘iranian People’ Is Trending On Twitter After Joe Biden’s Sotu 2022 Speech

ఆ సమయంలో బైడెన్ నోట ‘యుక్రెనియన్లు’ అని పలకడానికి బదులుగా ‘ఇరానియన్లు’ అని పలికారు. బైడెన్ పలికిన ఈ పదం కాసేపట్లోనే ట్విటర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. బైడెన్‌ పలికిన ఈ పదంపై మీమ్స్‌ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరోవైపు.. రిపబ్లికన్‌ మద్దతుదారులు ట్విటర్‌లో డెమొక్రాట్లపై విమర్శలను గుప్పిస్తున్నారు.


బైడెన్‌ ఇలా పదాలను తప్పుగా పలకడం మొదటిసారి కాదు.. గతంలోనూ వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హ్యారిస్‌ గురించి మాట్లాడుతూ ఇలానే తప్పుగా పలికారు.. అప్పుడు ‘ప్రెసిడెంట్‌ కమలా హ్యారిస్‌’ అని సంబోధించారు. బైడెన్ కు చిన్నప్పటి నుంచి కొంచెం నత్తి.. చాలాసార్లు బైడెన్‌ తన ప్రసంగాల్లో ఇలాంటి పొరపాటుగా పదాలను పలికేవారు. ఆ సమస్యను ఆయన అధిగమించేందుకు చాలా ప్రయత్నాలు చేసేవారు. కానీ, ఏదో ఒకసారి ఇలా బయటపడిపోతుంటారు.

ఇప్పుడూ కూడా ఇలానే జరిగింది. బైడెన్ పొరపాటుగా పలికిన పదాన్ని నెటిజన్లు ఇలా ట్రెండింగ్ చేసేశారు. ట్విట్టర్ ట్రెండింగ్ లో ఇరానియన్ అనే హ్యాష్ ట్యాగ్ టాప్ సెర్చ్ లోకి వెళ్లింది. రష్యా చర్యలను తీవ్రంగా ఖండించిన బైడెన్.. పుతిన్ అంతు చూస్తామని, యుక్రెయిన్ ప్రజలను కాపాడుతామని తన ప్రసంగంలో స్పష్టం చేశారు. అమెరికాతో పాటు ఇతర ప్రపంచ దేశాలు కూడా పుతిన్ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Read Also :  Russia Ukraine War : యుక్రెయిన్‌ను కాపాడుతాం.. పుతిన్ అంతు చూస్తాం.. రష్యా విమానాలపై బైడెన్ ఆంక్షలు!