Vasantha Nageshwar Rao: మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన వసంత నాగేశ్వరరావు

టీడీపీ, జనసేన పొత్తు ఉంది కాబట్టి నందిగామ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి టిక్కెట్ తెచ్చుకుంటే పూర్తి స్థాయిలో తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

Vasantha Nageswara Rao

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్యకు ఇప్పటికే రెండు సార్లు టీడీపీ టిక్కెట్ ఇచ్చిందన్నారు.

ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఉంది కాబట్టి.. నందిగామ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి టిక్కెట్ తెచ్చుకుంటే తమ పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందని  వసంత నాగేశ్వరరావు ప్రకటించారు.

నందిగామ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి ఇవాళ ఐతవరం గ్రామంలో జనసేన పార్టీ జెండా దిమ్మె ఆవిష్కరణ సందర్భంగా వసంత నాగేశ్వరరావును ఆయన ఇంటి వద్ద మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజకీయాలపై తన అనుభవాలను రమాదేవికి తెలిపారు. పలు సూచనలు చేశారు.

Balashowry: పవన్‌ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వైసీపీ ఎంపీ బాలశౌరి