Vasireddy Padma On Chandrababu : చంద్రబాబుకి నోటీసులు ఇవ్వలేదు, కేవలం ఆహ్వానం పంపాము-వాసిరెడ్డి పద్మ

బోండా ఉమ ఆడిన రాజకీయ డ్రామాలో చంద్రబాబు పావులా మారారు. బోండా ఉమ లాంటి కాలకేయులకు చంద్రబాబు టీమ్ లీడర్.

Vasireddy Padma On Chandrababu : ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. టీడీపీ నేత బోండా ఉమపై మరోసారి ఫైర్ అయ్యారు. మహిళల గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుందని హెచ్చరించారు. బోండా ఉమ తన చిల్లర రాజకీయాల కోసం చంద్రబాబు పరువు తీశారని ఆమె ధ్వజమెత్తారు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు జారీ విషయంపైనా వాసిరెడ్డి పద్మ స్పందించారు. చంద్రబాబుకి తాము నోటీసులు ఇవ్వలేదన్నారు. కేవలం కౌన్సిలింగ్ ఇవ్వటానికి ఆహ్వానం మాత్రమే పంపామని స్పష్టం చేశారు. ఈ సమస్యని తాను తన వ్యక్తిగతంగా తీసుకోలేదని చెప్పారు. అలా తీసుకుంటే కోర్టులో కేసులు వేసేదాన్ని అన్నారు.(Vasireddy Padma On Chandrababu)

Chandrababu Letter : రాష్ట్రంలో దిశ చట్టం అమల్లో ఉందా? : సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ

బోండా ఉమ లాంటి ఆకు రౌడీలు, చిల్లర రౌడీలు మమ్మల్ని ఏమి చేయలేరు అని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. బోండా ఉమ ఆడిన రాజకీయ డ్రామాలో చంద్రబాబు పావులా మారారు అని ఆమె అన్నారు. బోండా ఉమ లాంటి కాలకేయులకు చంద్రబాబు టీమ్ లీడర్ అని విమర్శించారు. బాలికను లైంగికంగా వేధించి ఆమె చావుకి కారణమైన వినోద్ జైన్ కేసులో తెలుగుదేశం పార్టీ ఎందుకు స్పందించడం లేదని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. మేమిచ్చిన నోటీసులకు భయపడి మహిళలను అడ్డం పెట్టుకుని కార్యక్రమాలు చేయడానికి టీడీపీ రెడీ అయిందని విమర్శించారు. చంద్రబాబు స్థాయిని ఆ పార్టీ నేతలే తగ్గించుకుంటున్నారని వాసిరెడ్డి పద్మ అన్నారు.

Andhra Pradesh : బాబు, బోండా ఉమా విచారణకు రావాలన్న మహిళా కమిషన్

”రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బోండా ఉమ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. విజయవాడ అత్యాచార బాధితురాలి అంశంపై టీడీపీ రాజకీయం చేస్తోంది. ఘటన జరిగిన సమాచారం తెలియగానే చర్యలకు కమిషన్‌ ఉపక్రమించింది. మూడేళ్లుగా ప్రతి కేసును మహిళా కమిషన్‌ పరిశీలిస్తోంది. మహిళలను అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్నారు. మాకు పబ్లిసిటీ పిచ్చి లేదు. ఇష్టానుసారంగా మాట్లాడితే బోండా ఉమకు ముందుంది. మహిళలే తగిన విధంగా బుద్ధి చెబుతారు. నాపై వ్యక్తిగతంగా మాట్లాడిన మాటాలు మహిళా లోకానికే అవమానం” అని వాసిరెడ్డి పద్మ అన్నారు.

Vijayawada : ఏపీలో మహిళలకు రక్షణ ఉందా ? ఆ ముగ్గురికి ఉరిశిక్ష వేయాలి

కాగా, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించే క్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను అగౌరవపరిచారని, బాధితురాలి ఆవేదన విననీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని, అత్యాచార బాధితురాలిని భయకంపితం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో చంద్రబాబు, బొండా ఉమ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని మహిళా కమిషన్ సమన్లు జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి చంద్రబాబు, బొండా ఉమ స్వయంగా విచారణకు రావాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సమన్లలో ఆదేశించారు.

ట్రెండింగ్ వార్తలు