Andhra Pradesh Temples : విజయవాడ కనకదుర్గమ్మ, తిరుమల దేవాలయాలు మూసివేత

28న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను మూసివేయనున్నారు.

Andhra Pradesh Temples : విజయవాడ కనకదుర్గమ్మ, తిరుమల దేవాలయాలు మూసివేత

durgamma,Tirumala Sri Venkateswara Swamy Temples

Updated On : October 7, 2023 / 2:23 PM IST

durgamma,Tirumala Sri Venkateswara Swamy Temples : 28న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసివేయనున్నారు. పాక్షిక చంద్ర గ్రహణం సందర్భంగా అక్టోబర్ 28 (2023)న సాయంత్రం 6 గంటల నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 29న తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ, స్నపనాభిషేకం, అలంకరణ, నిత్య పూజలు అర్చకులు పూర్తిచేసి ఉదయం 9 గంటల తర్వాత భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.

అలాగే చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. 28న రాత్రి 7.05 నుంచి తెల్లవారుజామున 3.15 వరకు ఆలయాన్ని మూసేస్తారు. ఆ తరువాత సంప్రోక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహించిన తరువాత భక్తుల్ని స్వామి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.

2023లో ఇప్పటికే సూర్య, చంద్రగ్రహణాలు ఏర్పడిన విషయం తెలిసందే. ఈక్రమంలో 2023 సంవత్సరంలో రెండవది చివరి చంద్రగ్రహణం అక్టోబరు 28న ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో పాక్షికంగా మాత్రమే కనిపించనుంది. కాగా ఈ ఏడాది ఇదే చివరి చంద్రగ్రహం కావటం విశేషం.