Bangladesh Gang : విజయవాడలో విదేశీయుల కలకలం.. దేశంలోకి అక్రమంగా చొరబడిన బంగ్లా గ్యాంగ్
దేశంలోకి అక్రమంగా చొరబడిన ముఠాను ఏపీ పోలీసులు పట్టుకున్నారు. విజయవాడలో నలుగురు బంగ్లాదేశ్ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Bangladesh Gang
vijayawada police bangladesh arrest four men bangladesh gang : దేశంలోకి అక్రమంగా చొరబడిన ముఠాను ఏపీ పోలీసులు పట్టుకున్నారు. విజయవాడలో నలుగురు బంగ్లాదేశ్ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హావ్ డా – వాస్కోడిగామా రైలులో వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాస్ పోర్టు లేకుండా తుల్లానా జిల్లా నుంచి వారు భారత్ లోకి ప్రవేశించారు.
దర్భంగా ఘటనతో అప్రమత్తమైన పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా వీరు పోలీసులకు చిక్కారు. నలుగురు బంగ్లా యువకులు ఏపీకి రావడానికి గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాఫ్తు చేస్తున్నారు. ఉపాధి కోసం అక్రమంగా భారత్ లోకి వచ్చినట్లు ప్రాథమికంగా వెల్లడైంది. వీరితో పాటు మరికొంతమంది బంగ్లాదేశీయులు భారత్ లోకి ప్రవేశించినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఇలా అక్రమంగా చొరబడి పలు రాష్ట్రాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన నలుగురు బంగ్లాదేశీయుల నుంచి నకిలీ పాన్, ఆధార్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఏపీలో పాస్ పోర్టు గడువు అయిపోయి ఇంకా అక్కడే ఉంటున్న వారి వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు.