Man Murder : చేతబడి చేస్తున్నాడనే నెపంతో గిరిజనుడి హత్య

మూఢ నమ్మకం విశాఖ ఏజెన్సీలో ఒక అమాయక ప్రాణాన్ని బలితీసుకుంది. చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో గ్రామస్తులు ఓ గిరిజనుడిని కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన ఆలస్యంగా బయట పడింది.

Man Murder : చేతబడి చేస్తున్నాడనే నెపంతో గిరిజనుడి హత్య

Murder

Updated On : October 22, 2021 / 12:31 PM IST

Villagers murder a tribal man : మూఢ నమ్మకం విశాఖ ఏజెన్సీలో ఒక అమాయక ప్రాణాన్ని బలితీసుకుంది. చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో గ్రామస్తులు ఓ గిరిజనుడిని కొట్టి చంపారు. డుంబ్రిగూడ మండలం ఇసుకలు గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం… ఇసుకలు గ్రామంలో కొన్నిరోజులుగా గ్రామస్తులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. దీంతో గ్రామానికి చెందిన కల్యాణ అనే గిరిజనుడే కారణమని గ్రామస్తులు భావించారు.

చేతబడి చేస్తున్నందునే గ్రామస్తులు చనిపోతున్నారని అనుమానం పెంచుకున్నారు. ఎలాగైనా అతడిని అంతమొందించాలని డిసైడ్‌ అయ్యారు. కుమారుడితో పొలం పనులకు వెళ్తున్న కల్యాణపై మారణాయుధాలతో దాడి చేశారు. విచక్షణా రహితంగా దాడి చేశారు. కల్యాణ రక్తపు మడుగులో కుప్పకూలి స్పాట్‌లోనే ప్రాణాలు వదిలాడు.

Sexually Assaults : ఇద్దరు కోడళ్లపై కొన్నిరోజులుగా మేనమామ లైంగిక దాడి

జరిగిన విషయాన్ని మిగతా గ్రామస్తులకు మృతుడి కుమారుడు చెప్పడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. అప్పటికే కల్యాణ చనిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.