Vasupalli Ganesh Kumar : గతంలో ఎన్నడూ ఇలాంటి ప్రమాదం జరగలేదు : ఎమ్మెల్యే వాసుపల్లి

బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ను ఆధునీకరణ చేయనున్న తరుణంలో ప్రమాదం జరగడం దురదృష్టకరం అన్నారు.

Vasupalli Ganesh Kumar

Vasupalli Ganesh Kumar Visit Fishermen : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదం జరగడం బాధాకరని స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ ఇలాంటి ప్రమాదం జరగలేదన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

ఈ ప్రమాదంలో 42 నుంచి 50 బోట్ల వరకు అగ్నికి ఆహుతి అయ్యాయని తెలిపారు. బోట్లు ఎవరెవరి అన్న దానికి సంబంధించి అధికారులు గుర్తిస్తున్నారని చెప్పారు. రూ.150 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ను ఆధునీకరణ చేయనున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరం అన్నారు.

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ప్రమద దురదృష్టకరం : జీవీఎల్
విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాద ఘటనపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. అటు బోట్లను, ఇటు ఉపాధిని కోల్పోయిన మత్స్యకారులకు, మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ విషయంపై కేంద్ర మత్స్యకార మంత్రిత్వ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలకు సంఘటన గురించి వివరించానని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర మత్స్య శాఖ నుంచి నష్టపోయిన మత్స్యకారులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరానని తెలిపారు. అందుకు కేంద్రం మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. మంగళవారం ఉదయం ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో బాధిత కుటుంబాలతో, బాధిత మత్స్యకారులతో సమావేశం నిర్వహించి వారికి తగిన సహాయం కోసమై తోడుగా నిలబడతానని చెప్పారు.

Heart Attack : వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ గుండెపోటుతో క్రికెట్ అభిమాని మృతి

మత్స్యకారులు ఈ సమయంలోనే ధైర్యాన్ని కోల్పోకుండా నిబ్బరంగా ఉండాలని సూచించారు. వారికి కేంద్ర స్థాయిలో ఏమేమి చేయగలనో అన్నీ చేస్తానని చెప్పారు. మరోసారి కేంద్ర మత్స్య శాఖా ఉన్నతాధికారులతో మాట్లాడతానని చెప్పారు. దురదృష్టకర సంఘటనను విపత్తుగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న విపత్తు నివారణ నిధుల నుండి నష్టపోయిన బోట్ల యజమానులకు వెంటనే నష్ట పరిహారాన్ని అందచేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ విపత్తు నివారణ నిధులలో కేంద్రం వాటా తొంబై శాతం ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే కేంద్రం నుండి కూడా చేయగలిన సహాయంపై పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తానని చెప్పారు. అటు బోట్లను, ఇటు ఉపాధిని కోల్పోయిన మత్స్యకారులకు, మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Fire Accident : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన 40 బోట్లు

విశాఖ ఫిషింగ్ హీర్బర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హార్బర్ లో బోట్లుకు నిప్పు అంటుకొని బోట్లు తగలబడిపోయాయి . 40 నుంచి 50 బోట్ల వరకు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఒకబోటు తరువాత మరో బోటుకు మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది.

ఫిషింగ్ హార్బర్ లోని ఒకటో నెంబరు జెట్టి వద్ద అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫిషింగ్ హార్బర్ చరిత్రలో కనివిని ఎరుగని అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫిషింగ్ హార్బర్ కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లు, ఒక ఫైర్ టగ్ నౌక తో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ట్రెండింగ్ వార్తలు