visakhapatnam Narcotics injections
visakhapatnam Narcotics injections : విశాఖపట్నంలో మత్తు ఇంజెక్షన్లు ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిదిమందిని అదుపులోకి తీసుకున్నారు.వారి నుంచి ఏడు వేల మత్తు ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. యువతను టార్గెట్ చేస్తు కొంతమంది ముఠాగా ఏర్పడి మత్తు ఇంజెక్షన్లు అమ్ముతున్నారనే పక్కా సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. విశాఖ నుంచి పశ్చిమ బెంగాల్ కు తరలిస్తుండగా పట్టకున్నారు. ఎనిమిదిమందిని అరెస్ట్ చేశారు. అలా రెండు రోజుల్లో మూడు కేసుల్లో ఏడు వేల మత్తు ఇంజెక్షన్లను ముఠా నుంచి స్వాధీనం చేసుకుని వాటిని సీజ్ చేశారు.
విశాఖపట్నంలో గుట్టుచప్పుడు కాకుండా మత్తు ఇంజక్షన్లను అమ్ముతున్న ముఠాపై నిఘా పెట్టారు. ఎనిమిదిమందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి ఏడువేల మత్తు ఇంజెక్షన్లు, ఓ కారు,నగదు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు. యువతను టార్గెట్ చేసుకుని సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల డ్రగ్స్ వినియోగం పెరిగిపోవడంతో పోలీసులు నిఘా పెట్టగా కేటుగాళ్లు అడ్డంగా బుక్ అయ్యారు.