Murder : నాటుసారా వ్యాపారి హత్య

West Godavari Sara Merchant Murder In Ap
నాటుసారి వ్యాపారి చల్లారి వెంకట్రావు హత్యకు గురయ్యాడు. ఓవ్యక్తి వచ్చి సారి ఇమ్మని అడుగగా..లేదని చెప్పినందుకు వ్యాపారి చల్లారి వెంకట్రావును బాబూరావు అనే వ్యక్తి ఇనుప రాడ్ తో కొట్టి చంపిన ఈ దారుణ ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని నల్లజర్ల మండలం చీపురుగూడెంలో చీపురుగూడెంలో నాటుసారా విక్రయించే 45 ఏళ్ల చల్లారి వెంకట్రావు అనే వ్యక్తిని బాబూరావు అనే వ్యక్తి అతికిరాతకంగా హత్య చేసాడు.
వెంకట్రావు నాటుసారా లేదు అని చెప్పండంతో ఆగ్రహానికి గురైన బాబూరావు అక్కడున్న ఇనుపరాడ్ను తీసుకుని బలంగా వెంకట్రావు తలపై బాదాడు. బలంగా పడిన ఆ దెబ్బకు వెంకట్రావు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. అనంతరరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెంకట్రావును కేవలం నాటుసారా కోసమే చంపాడా? లేక పాత కక్షలేమన్నా ఉన్నాయా? అనే కోణంలో కేసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న బాబూరావు కోసం గాలింపు ముమ్మరం చేశారు.