AP Assembly : ఏపీ అసెంబ్లీలో ఏం జరిగింది ?

ఉదయం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి హాట్‌హాట్‌గా జరిగాయి.. ఉదయం నుంచి అటు వైసీపీ, టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్‌ కొనసాగుతూనే ఉంది..

AP Assembly : ఏపీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిచే వరకు సభలో అడుగు పెట్టనంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సభలో మాట్లాడిన చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారు.. రెండున్నరేళ్లుగా ఎన్నో అవమానాలను భరించానని.. తన భార్యపై కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.. ఇంతలో స్పీకర్‌ మైక్‌ కట్‌ చేయడంతో సభ్యులకు నమస్కరిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలలో వాకౌట్ చేశారు.

Read More : CM Jagan : బాబు ప్రస్టేషన్‌‌లో ఉన్నారు – సీఎం జగన్

2021, నవంబర్ 19వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి హాట్‌హాట్‌గా జరిగాయి.. ఉదయం నుంచి అటు వైసీపీ, టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్‌ కొనసాగుతూనే ఉంది.. మంత్రి అప్పలరాజు మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. బాబాయ్ గొడ్డలిపోటు అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. దీంతో అంబటి రాంబాబు టీడీపీ సభ్యులపై విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో ఆడియో లీకులను టీడీపీ సభ్యులు ప్రస్తావించారు.. దీంతో అందరి చరిత్రలు చర్చిద్దామంటూ చంద్రబాబు టార్గెట్‌గా అంబటి విమర్శలు చేశారు. మాధవరెడ్డి హత్యపైనా మాట్లాడదామన్నారు. అంబటి వ్యాఖ్యలతో సభలో సభ్యులు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత చంద్రబాబు ఉద్వేగ భరితంగా మాట్లాడి.. సభ నుంచి వెళ్లిపోయారు.

Read More : Heavy Rain : అనంతపురంపై ప్రకృతి కన్నెర్ర…ఎటు చూసినా నీరే

అయితే చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు వైసీపీ నేతలు. సభలో చంద్రబాబు నటనా చాతుర్యం ప్రదర్శించారంటూ అంబటి కౌంటర్‌ ఇచ్చారు. ఈ రోజుతో చంద్రబాబు రాజకీయ భవిష్యత్తుకు నూకలు చెల్లాయన్నారు. ఇక చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిపోవాలని నిన్ననే నిర్ణయం తీసుకున్నారని.. కావాలనే ఒక కారణాన్ని క్రియేట్‌ చేసి సభ నుంచి వెళ్లిపోతున్నట్టు నటించారని మంత్రి కోడాలి నాని అన్నారు.. చంద్రబాబు మంగమ్మ శపథాలకు భయపడరని అన్నారు.

Read More : Becoming CM Again : ప్రజాక్షేత్రంలో పోరాడుతా ? ప్రజల్లో మార్పులు రావాలి

బాబాయ్‌ గొడ్డలి అన్న వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు కావాలనే రెచ్చగొట్టారని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.. మాధవ రెడ్డి హత్య గురించి మాట్లాడితే చంద్రబాబు.. తన సతీమణి పేరును మధ్యలోకి తీసుకొచ్చారని అన్నారు.. కుప్పం ఓటమిని జీర్ణించుకోలేక సానుభూతి డ్రామా చేయడానికి ఈ కుట్ర చేశారన్నారు కన్నబాబు. ఫ్రస్టేషన్‌లో టీడీపీ నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. తాను చంద్రబాబు గురించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. చంద్రబాబు భార్య గురించి ఎవరైనా మాట్లాడితే చెప్పుతో కొట్టండంటూ 10టీవీతో అన్నారు. చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోవాలని ముందే నిర్ణయించుకున్నారని విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు