Heavy Rain : అనంతపురంపై ప్రకృతి కన్నెర్ర…ఎటు చూసినా నీరే

లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా కాలనీల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. కనీసం కూర్చునేందుకు నిల్చునేందుకు అవకాశం లేక .. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

Heavy Rain : అనంతపురంపై ప్రకృతి కన్నెర్ర…ఎటు చూసినా నీరే

Anantapuram

Heavy Rain In Anantapur : కరువు జిల్లా అనంతపురంపై ప్రకృతి కన్నెర్ర చేసింది. భారీ వర్షాలు.. వరదలకు ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. వాగులు, వంకలు ఉప్పొంగాయి. చెరువులన్నీ నిండి సముద్రాలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా కాలనీల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. కనీసం కూర్చునేందుకు నిల్చునేందుకు అవకాశం లేక .. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాగులు ఉప్పొంగడంతో .. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. హిందూపురం మండలం చిలమత్తూరు వద్ద చిత్రావతి, కుషావతి ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో.. దిగువ ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది.

Read More : Chitravathi River Rescue Operation : చిత్రావతి నదిలో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకు వచ్చిన హెలికాప్టర్

దీంతో ఆయా గ్రామాల ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. అటు కర్ణాటకలోని బళ్లారి నుంచి గుంతకల్‌కు వచ్చే రహదారి డొనేకల్లు వద్ద .. నీటి ఉధృతి పెరిగింది. దీంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఇక కదిరిలో విటలరాయుని చెరువుకు వరద పోటెత్తడంతో .. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మద్దిలేరు వాగుకు భారీ వరద రావడంతో నరసింహ స్వామి దేవాలయం కోనేటిని నీరు ముంచెత్తింది. ఇక కదిరి మండలం ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంను వరద ముంచెత్తడంతో.. గర్హగుడిలోని గంగమ్మ నీట మునిగింది. పుట్టపర్తిలో భారీ వర్షాలకు పలుచోట్ల వృక్షాలు నేలకూలాయి.

Read More : Becoming CM Again : ప్రజాక్షేత్రంలో పోరాడుతా ? ప్రజల్లో మార్పులు రావాలి

దుర్గమ్మ గుడి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. అటు వరద సత్యమ్మ గుడి పరిసర ప్రాంతాలను ముంచెత్తింది. పెడబల్లి, రాయలవారి పల్లి, కోవెలగుట్ల పల్లి వద్ద చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో.. ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కర్ణాటక నాగేపల్లి, జానకంపల్లి మీదుగా బుక్కపట్నం, కొత్తచెరువు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎనుములపల్లి వద్ద కోతకు వచ్చిన వరి పంట .. పూర్తిగా నీట  మునిగింది. కొత్తచెరువు మండలం కేశాపురం వెల్దుర్తి గ్రామాల మధ్య వరద నీటిలో పోలీసు వాహనం కొట్టుకుపోయింది. అయితే జేసీబీ సాయంతో వెలికి తీస్తుండగా.. వరద నీటిలో చిక్కుకుపోయింది.