టీడీపీ అభ్యర్థి ఎవరు? ఉత్కంఠ రేపుతున్న పెనమలూరు రాజకీయం

పెనమలూరు టీడీపీ అభ్యర్థిగా పార్థసారథి రంగంలోకి దిగితే పరిస్థితి ఏంటన్నది చర్చించారు. బోడె ప్రసాద్ కు నచ్చ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.

Who is Penamaluru TDP Candidate

Penamaluru Politics : పెనమలూరు సీటు విషయంలో టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. పార్థసారథికి పెనమలూరు సీటు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైంది. పార్థసారథి వ్యవహారంలో టీడీపీలోని బోడె ప్రసాద్ వర్గం అంతా ఒకచోట సమావేశమైంది. పెనమలూరు సీటును పార్థసారథికి ఇస్తారన్న ప్రచారంతో బోడె ప్రసాద్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ, జనసేన నేతలు కూడా హాజరయ్యారు. ఇటు పెనమలూరూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ను బుజ్జగించేందుకు గద్దె రామ్మోహన్ వెళ్లారు.

Also Read : 23మంది సిట్టింగ్‌లకు నో టికెట్.. సీఎం జగన్ వారిని ఎందుకు పక్కన పెట్టారు? మార్పు వెనుక మర్మం ఏమిటి?

పెనమలూరు టీడీపీ అభ్యర్థిగా పార్థసారథి రంగంలోకి దిగితే పరిస్థితి ఏంటన్నది చర్చించారు. బోడె ప్రసాద్ కు నచ్చ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో ప్రాధాన్యత, రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇస్తున్నారు. పెనమూలురులో అభ్యర్థి మార్పు అంశంపై బోడె ప్రసాద్ స్పందించారు. కార్యకర్తలు అంతా ఎంతో ఆవేదనతో ఉన్నారని చెప్పారు.

 

Also Read : ఇటు వైసీపీ కీలక నేతలకు గాలం, అటు గ్రూపు తగాదాలు పరిష్కారం‌.. ఎన్నికల వేళ చంద్రబాబు అదిరిపోయే వ్యూహం