YSRCP: జగన్‌కు మర్రి ఝలక్.. ఎమ్మెల్సీలు ఎందుకిలా? వీళ్ల బాటలో మరికొందరు?
ఇప్పటివరకు మర్రి రాజశేఖర్‌తో కలిపి.. ఐదుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు.

అధికారం కోల్పోయిన తర్వాత.. వైసీపీకి వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయ్. రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. రాజ్యసభ సభ్యులు నలుగురు రాజీనామా చేయగా.. మర్రి రాజశేఖర్‌తో కలిపి వైసీపీకి బైబై చెప్పిన ఎమ్మెల్సీ సంఖ్య ఐదుకు చేరింది. అసలు ఎందుకిలా వరుసగా క్యూ కడుతున్నారు.. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న మర్రి రాజశేఖర్.. ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు.. ఈ వలసలు ఇక్కడితో ఆగేనా.. లేదంటే మరిన్ని సంచలనాలు ఖాయమా..
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైసీపీ ముఖ్య నేతలు వరుస పెట్టి పార్టీని వీడుతున్నారు. అసెంబ్లీలో 11 సీట్లకే పరిమితమైన వైసీపీకి.. మండలిలో మెజార్టీ ఉంది. ఐతే అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా ఫ్యాన్ పార్టీకి హ్యాండ్ ఇస్తున్నారు.
మొత్తం ఐదుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. 2029 వరకు పదవీ కాలం ఉన్నా.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు మర్రి రాజశేఖర్.. త్వరలో టీడీపీ గూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయ్. రాజీనామా వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కోరగా.. నిర్ణయం తీసేసుకున్నానని స్పీకర్‌కు రిజైన్ లెటర్ ఇచ్చేశారు మర్రి. వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఐదుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా
ఇప్పటివరకు మర్రి రాజశేఖర్‌తో కలిపి.. ఐదుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు. పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ ఇప్పటికే రాజీనామా చేశారు. వీళ్ల బాటలో మరికొందరు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఏపీ రాజకీయవర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.
నిజానికి మర్రి రాజశేఖర్ కంటే ముందు.. నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసినా.. దానికి ఇంకా ఆమోదముద్ర పడలేదు. దీంతో తమ రాజీనామాలను ఆమోదించాలని వాళ్లు పట్టిన పట్టు వీడడం లేదు. శాసనసభలో కనీసం ప్రతిపక్ష హోదా లేకపోయినా.. మండలిలో వైసీపీకి బలం ఉంది. దీంతో బిల్లుల ఆమోదానికి ఇప్పటివరకూ ఇబ్బంది లేదు. ఐతే ఇప్పుడు వరుసగా ఎమ్మెల్సీలు రాజీనామాలు చేస్తుండడం.. ఫ్యాన్ పార్టీ పెద్దలను టెన్షన్ పెడుతోంది.
నిజానికి చిలకలూరిపేట ఇంచార్జిగా విడదల రజనిని నియమించినప్పటి నుంచి.. మర్రి రాజశేఖర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రజనీ మళ్లీ చిలకలూరిపేటలో అడుగు పెడితే… పార్టీకి కూడా దూరంగా ఉంటానంటూ.. సన్నిహితుల దగ్గర మర్రి చెప్పుకున్నారన్న గుసగుసలు కూడా వినిపించాయ్.
దీంతో వైవీ సుబ్బారెడ్డిలాంటి కీలక నేతలు గతంలో బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. రాజీనామా చేసే ముందు కూడా మర్రి రాజశేఖర్‌కు వైసీపీ పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఐనా సరే పార్టీకి, పదవికి బైబై చెప్తూ మర్రి నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న మర్రి రాజశేఖర్‌కు.. జగన్‌కు అత్యంత సన్నిహితులు. 2014లో చిలకలూరిపేట నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో పోటీకి రెడీ అవగా.. విడదల రజనీకి జగన్ సీటు కేటాయించారు. ఐతే ఎమ్మెల్సీని చేసి మంత్రిగా అవకాశం ఇస్తానని జగన్ ప్రకటించారు. ఐతే అది నెరవేరలేదు. 2023లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది.
మంత్రి పదవి మాత్రం రాలేదు. ఐతే 2024 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ వెళ్లిన రజనీ.. ఘోరంగా ఓడిపోయారు. ఐతే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మళ్లీ చిలకలూరిపేట ఇంచార్జిగా రజనీకి బాధ్యతలు అప్పగించారు. దీంతో మర్రి రాజశేఖర్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో పార్టీని వీడాలని మద్దతుదారుల నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో.. ఇప్పుడు మర్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తున్నారు.
మర్రి రాజశేఖర్‌కు ముందు.. పోతుల సునీత, జయమంగళ వెంకట రమణ, కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి రాజీనామాలు శాసనమండలి ఛైర్మన్ దగ్గర ఉన్నాయ్. ఇప్పటికే కొత్తగా ఐదుగురు ఎమ్మెల్సీలు అధికార కూటమి నుంచి నెగ్గారు. ఈ ఐదుగురు ఎమ్మెల్సీల రాజీనామాలను ఛైర్మన్ ఆమోదిస్తే… మొత్తం పదినెలల కాలంలో పది మంది ఎమ్మెల్సీలు కూటమి వశం అయినట్లు అవుతుంది. మరి ఎమ్మెల్సీల రాజీనామాల పర్వం ఇక్కడితో ఆగుతుందా.. ఇలానే సాగుతుందా అంటే.. కాలమే సమాధానం చెప్పాలి!