Kottu Satyanarayana : చంద్రబాబు లాంటి దుర్మార్గుడిని పవన్ కల్యాణ్ ఎందుకు సమర్థిస్తున్నాడు? మంత్రి కొట్టు సత్యనారాయణ

Kottu Satyanarayana : సీఎం జగన్ ను చూసి ప్రతిపక్షాల నేతలకు కడుపు భగభగ మండిపోతోందన్నారు. అమ్మవారి వాహనం ఎక్కి పవన్ కల్యాణ్ మాట్లాడే మాటలకి అమ్మవారు ఊరుకుంటుందా?

Kottu Satyanarayana : చంద్రబాబు లాంటి దుర్మార్గుడిని పవన్ కల్యాణ్ ఎందుకు సమర్థిస్తున్నాడు? మంత్రి కొట్టు సత్యనారాయణ

Kottu Satyanarayana (Photo : Google)

Updated On : July 7, 2023 / 10:53 PM IST

Kottu Satyanarayana – Pawan Kalyan : ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై విరుచుకుపడ్డారు. తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ను అద్దెకు తెచ్చుకున్నారని మంత్రి కొట్టు ఎద్దేవా చేశారు. వారాహి అని
చెప్పి అమ్మవారి వాహనం ఎక్కి పవన్ కల్యాణ్ మాట్లాడే మాటలకి అమ్మవారు ఊరుకుంటుందా? అని ఆయన అడిగారు.

రెండో దశ వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ ను 4 నియోకవర్గాల్లో కాదు 40 నియోకవర్గాల్లో తిరగమనండి అని ఆయన అన్నారు. షూటింగ్ లో ఖాళీ ఉండటంతోనే పవన్ కల్యాణ్ రెండో దశ వారాహి యాత్రకు సిద్ధమయ్యారని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు.

Also Read..Chandrababu Naidu: అన్నం తినే వ్యక్తి జగన్‌కు ఓటేయడు.. అంతేకాదు..: చంద్రబాబు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బి. కొండేపాడులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. సీఎం జగన్ ను చూసి ప్రతిపక్షాల నేతలకు కడుపు భగభగ మండిపోతోందన్నారు. ‘పవన్ కల్యాణ్ మతి ఉండి మాట్లాడుతున్నాడా? మతి లేక మాట్లాడుతున్నాడా?

చంద్రబాబు లాంటి దుర్మార్గుడిని పవన్ కల్యాణ్ ఎందుకు సమర్ధిస్తున్నాడు? ఎన్డీయేలోకి రావాలని టీడీపీకి ఆహ్వానం అందినట్లు చంద్రబాబు డబ్బాలు కొట్టుకుంటున్నారు. వెళ్లి ఎన్డీయేలో చేరమనండి. ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి” అని మంత్రి కొట్టు సత్యనారాయణ తేల్చి చెప్పారు.