Ambati Rambabu : చంద్రబాబు ఐదేళ్లు కష్టపడితే ప్రజలు ఎందుకు తిరస్కరించారు? మంత్రి అంబటి రాంబాబు

హైకోర్టు, సుప్రీంకోర్టులో సక్రమమైన అరెస్ట్ అని చెప్పి రిమాండ్ కి పంపించారు. భర్త దుర్మార్గుడైనా, దొంగ అయినా హిందూ సంప్రదాయ స్త్రీ.. తన భర్త మంచివాడనే చెబుతుంది. Ambati Rambabu

Ambati Rambabu Fires On TDP Leaders

Ambati Rambabu Fires On TDP Leaders : చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని, రాజకీయ కక్ష సాధింపు చర్య అని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే.. చంద్రబాబు నేరం చేశారని, అందుకే అరెస్ట్ అయ్యారని, ఇందులో రాజకీయ కక్ష సాధింపు చర్య లేదని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. తాజాగా ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ సక్రమమైనదే అని తేల్చి చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమైతే న్యాయస్థానంలో రిజెక్ట్ చేస్తారు కదా? అని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు.

ఏ హిందూ సంప్రదాయ స్త్రీ అయినా అలానే చెబుతుంది..
టీడీపీ నేతలు చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని పదే పదే చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పదే పదే అదే మాట చెబుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం కాదు సక్రమమైంది. ఆ అరెస్ట్ అక్రమమైతే న్యాయస్థానంలో రిజెక్ట్ చేస్తారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో సక్రమమైన అరెస్ట్ అని చెప్పి రిమాండ్ కి పంపించారు. భర్త దుర్మార్గుడైనా, దొంగ అయినా హిందూ సంప్రదాయ స్త్రీ.. తన భర్త మంచివాడనే చెబుతుంది.

Also Read : కొడాలి నానికి ఎన్టీఆర్ దేవుడు అయినప్పుడు ఆయన కుమార్తె భువనేశ్వరి దేవత కాదా? బుద్ధా వెంకన్న

లోకేశ్ కు అర్హత లేకున్నా మంత్రిని చేశారు..
నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. చంద్రబాబు ఎంత గొప్పవాడో ప్రజలు చెప్పాలి. ప్రజలకి మీరు చెప్పనవసరం లేదు. ఐదు సంవత్సరాలు చంద్రబాబు కష్టపడితే ప్రజలు ఎందుకు తిరస్కరించారు? చంద్రబాబు తన కుటుంబాన్ని ఎక్కడా అశ్రద్ధ చేయలేదు. లోకేశ్ కి ఎటువంటి అర్హత లేకపోయినా మూడు శాఖల మంత్రి పదవి ఎందుకు కట్టబెట్టారు?

మీ ఆస్తులపై విచారణకు సిద్ధమా?
మీకు సవాల్ విసురుతున్నా. మీ ఆస్తుల విషయంలో కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలతో ఎంక్వైరీకి మీరు సిద్ధమా? చంద్రబాబు ఎప్పుడు నిజం చెప్పారు? చంద్రబాబు అన్ని సాక్ష్యాలతో దొరికిపోయారు. అందుకే ఈరోజు నిజం గెలుస్తుంది. ఎన్టీఆర్ ఇద్దరు కుమార్తెలు భువనేశ్వరి, పురంధరేశ్వరి గొప్పగా మాట్లాడుతున్నారు. పురంధరేశ్వరి తన మరిదిని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీజేపీ అభివృద్ధి కోసం కాదు. లోకేశ్ పదే పదే అడిగితేనే అమిత్ షా దగ్గరకు తీసుకెళ్ళామని కిషన్ రెడ్డి చెప్పారు. బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ గా కాకుండా పురంధరేశ్వరి ఒక మీడియేటర్ గా వ్యవహరిస్తున్నారు.

Also Read : కొడాలి నాని పనైయిపోయింది : వెనిగండ్ల రాము

మద్యం అమ్మకాలు తగ్గాయి..
ఏపీలో లిక్కర్ స్కామ్ అంటూ పురంధేశ్వరి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. డిస్టిలరీ సంస్థలకు మా ప్రభుత్వం ఎప్పుడూ అనుమతులు ఇవ్వలేదు. అనుమతులన్నీ గత ప్రభుత్వాలు ఇచ్చినవే. బ్రాండ్స్ పేర్లన్నీ చంద్రబాబు హయాంలో అనుమతులు ఇచ్చినవే. మా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గాయి” అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.