Petrol Price : చిత్తూరు జిల్లా కుప్పంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110

ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం పెట్రోల్ పై 30 పైసలు పెరిగింది. దీంతో తెలుగురాష్ట్రాలలో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ రేట్లు రూ.110 కి చేరువయ్యాయి. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే రూ.110 రూపాయలకు చేరింది. ఆంధ్రప్రదేశ్ లో ఇదే అధికం. ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.63 ఉండగా, విశాఖపట్నంలో రూ.106.80 గా ఉంది.

Petrol Price : చిత్తూరు జిల్లా కుప్పంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110

Petrol Price (5)

Updated On : July 18, 2021 / 6:22 AM IST

Petrol Price : ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం పెట్రోల్ పై 30 పైసలు పెరిగింది. దీంతో తెలుగురాష్ట్రాలలో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ రేట్లు రూ.110 కి చేరువయ్యాయి. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే రూ.110 రూపాయలకు చేరింది. ఆంధ్రప్రదేశ్ లో ఇదే అధికం. ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.63 ఉండగా, విశాఖపట్నంలో రూ.106.80 గా ఉంది.

శ్రీకాకుళం జిల్లా కంచిలిలో లీటర్ పెట్రోల్ రూ.108.92 ఉండగా.. ఇక్కడ డీజిల్ ధర 100.39కి చేరింది. విశాఖతో పోల్చితే కుప్పంలో మూడు రూపాయలు తేడా ఉంది. ఇక పక్కపక్కనే ఉండే.. కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా పెట్రోల్ రెట్లమధ్య వ్యత్యాసం కనిపిస్తుంది. విజయవాడ, గుంటూరులో 20 పైసలు తేడా కనిపిస్తుంది. ఇక విజయవాడ నగరంలోని బెంజిసర్కిల్ లో ఓ రేటు ఉంటే.. భవానీపురంలో మరోరేటు ఉంది.

రవాణా ఛార్జీలే ధరల తేడాకు కారణమని ఇంధన సంస్థలు చెబుతున్నాయి. ఇక తెలంగాణలో కూడా అదే పరిస్థితి హైదరాబాద్ లో రూ.105.85 పైసలు ఉంటే.. ఆదిలాబాద్, నిజామాబాదు జిల్లాలో రూ.107.90గా ఉంది