Paritala Sriram
Paritala Sriram : అనంతపురం జిల్లా టీడీపీ ధర్మవరం ఇంచార్జి, మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం టీడీపీ టికెట్ సూరికి (గోనుగుంట్ల సూర్యనారాయణ) వస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా అని ప్రకటించారు.
Corona Pfizer : అప్పటివరకు కరోనా అంతం కాదు..! షాకింగ్ విషయం చెప్పిన ప్రముఖ ఫార్మా కంపెనీ
ధర్మవరంలో టీడీపీలోకి ఎవరు వచ్చినా నేనే కండువా వేస్తానని శ్రీరామ్ అన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేస్తే పదవి ఇప్పిస్తానని చెప్పారు. నేను చెప్పినా ఒకటే, చంద్రబాబు దగ్గరికి వెళ్లినా చెప్పేది ఒకటే అన్నారు. కాదు కూడదు అని ఎవరైనా టీడీపీ తరఫున టికెట్ తెచ్చుకుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని హెచ్చరించారు.
Balakrishna : ‘అన్ స్టాపబుల్’ బాలయ్యతో మాస్ మహారాజ్
మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణను ఉద్దేశించి పరిటాల శ్రీరామ్ పరోక్షంగా ఘాటుగా స్పందించారు. ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే విదేశాల్లో దాక్కున్నా వైసీపీ నాయకులను బయటకు లాక్కొస్తామన్నారు పరిటాల శ్రీరామ్. వాలంటీర్లకు కూడా పరిటాల శ్రీరామ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ సభలకు వస్తున్న ప్రజలను వాలంటీర్లు ఇబ్బందులు పెడుతున్నారని, ఇది మంచిది కాదని అన్నారు.