Pfizer On Corona End : అప్పటివరకు కరోనా అంతం కాదు..! షాకింగ్ విషయం చెప్పిన ప్రముఖ ఫార్మా కంపెనీ

ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనావైరస్ మహమ్మారి అంతం ఎప్పుడు? ఇప్పుడీ ప్రశ్న అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాగా, కరోనా అంతం గురించి ప్రముఖ ఫార్మా కంపెనీ

Pfizer On Corona End : అప్పటివరకు కరోనా అంతం కాదు..! షాకింగ్ విషయం చెప్పిన ప్రముఖ ఫార్మా కంపెనీ

Corona Pfizer

Pfizer On Corona End : ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనావైరస్ మహమ్మారి అంతం ఎప్పుడు? ఇప్పుడీ ప్రశ్న అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాగా, కరోనా అంతం గురించి ప్రముఖ ఫార్మా కంపెనీ ఫైజర్ షాకింగ్ న్యూస్ చెప్పింది. 2024 వరకు కరోనా మహమ్మారి అంతం కాదని అంచనా వేసింది. కరోనా మహమ్మారి ప్రభావం 2024 సంవత్సరం వరకు కొనసాగవచ్చని హెచ్చరించింది. ఇటీవల పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ నేపథ్యంలో ఫైజర్ ఈ ప్రకటన చేసింది.

Balakrishna : ‘అన్ స్టాపబుల్’ బాలయ్యతో మాస్ మహారాజ్

అయితే, 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి ఎండ్ స్టేజ్ కి వస్తుందని ఫైజర్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ మైఖేల్ చెప్పారు. ఇది.. కొత్త వేరియంట్లు, దానిపై వ్యాక్సిన్ల ప్రభావం వంటి వాటిపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. చాలా దేశాల్లో ఒకటి లేదా రెండేళ్ల పాటు కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంటుందని హెచ్చరించారు.

Best Foods : రన్నింగ్, జాగింగ్ చేసే వారికి బెస్ట్ ఫుడ్స్ ఇవే…

రెండేళ్ల క్రితం చైనాలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటూ విరుచుకుపడుతోంది. మొన్నటి వరకు డెల్టా, ఆల్ఫా, బీటా వేరియంట్లు విజృంభించగా.. తాజాగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కలవరపెడుతోంది. నవంబర్‌ నెలాఖరులో తొలుత సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ కొత్త ఉత్పరివర్తనం.. ఇప్పటికే దాదాపు సగం ప్రపంచ దేశాలకు విస్తరించింది. గతంలో వచ్చిన వేరియంట్ల కంటే వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

తగ్గిందనుకున్న కరోనా మహమ్మారి రూపం మార్చుకుని మళ్లీ బుసలు కొడుతోంది. దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ను గుర్తించారు. 32 మ్యుటేషన్లు ఉన్న ఈ వేరియంట్ కు ‘ఒమిక్రాన్’గా పేరు పెట్టారు. దీన్ని ప్రమాదకరమైన వేరియంట్ గా వైద్య నిపుణులు గుర్తించారు. ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగి ఉందని తెలిపారు.

కరోనా వైరస్‌ కొత్త రూపంలో మానవాళిని భయాందోళనకు గురిచేస్తోంది. డెల్టా కంటే ప్రమాదకరమైన ఈ కొత్త రకం వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. నిఘా పెంచాలని, ప్రజారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేయాలని సూచించింది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ని మరింత వేగవంతం చేయడంతో పాటు వైరస్‌ వ్యాప్తికి అవకాశం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలంది. పండుగలు, ఇతర వేడుకలను కొవిడ్‌ నిబంధనలకు లోబడి నిర్వహించుకోవాలని, భౌతికదూరం పాటించడంతో పాటు జనసమూహాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొవిడ్ నిబంధనల పట్ల అలసత్వం ప్రదర్శించరాదన్నారు.