Woman Farmer : వీఆర్వో చెంప చెల్లు మనిపించిన మహిళ రైతు
తమ ఏడు ఎకరాల భూమిని వేరే వారి పేరు మీద అక్రమంగా పత్రాలు సృష్టించారని ఆరోపణలు చేశారు. తమను కోర్టుకు వెళ్లేలా చేశాడని మండిపడ్డారు.

woman beat VRO
Woman Farmer Beat VRO : కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో ఓ మహిళ రైతు వీఆర్వో చెంప చెల్లు మనిపించారు. గోనెగండ్ల మండలం పెద్ద నెలటూర్ గ్రామంలో భూ వివాదంపై మహిళ రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ సర్పంచ్ చాకలి వీరయ్య భార్య శివపార్వతి వీఆర్వోతో వాగ్వాదానికి దిగారు. తమ ఏడు ఎకరాల భూమిని వేరే వారి పేరు మీద అక్రమంగా పత్రాలు సృష్టించారని ఆరోపణలు చేశారు.
Alajangi Jogarao : చంద్రబాబు దళిత వ్యతిరేకి.. గజం స్థలం ఆక్రమించినట్లు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా
తమను కోర్టుకు వెళ్లేలా చేశాడని మండిపడ్డారు. మిగతా రెండు ఎకరాలను కూడా సాగు చేయకుండా అడ్డుపడుతున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని రైతు దంపతులు డిమాండ్ చేశారు.