Road Accident : విజయవాడలో రోడ్లు శుభ్రం చేస్తున్న సిబ్బందిని ఢీకొట్టిన కారు…మహిళ మృతి

ఫ్లై ఓవర్ పై వేగంగా దూసుకొచ్చిన కారు ముగ్గురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే చనిపోయింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Road Accident : విజయవాడలో రోడ్లు శుభ్రం చేస్తున్న సిబ్బందిని ఢీకొట్టిన కారు…మహిళ మృతి

Accident (4)

Updated On : February 14, 2022 / 10:29 AM IST

road accident : విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. వేగంగా దూసుకొచ్చిన కారు విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లై ఓవర్ పై రోడ్లు శుభ్రం చేస్తోన్న సిబ్బందిని ఢీకొట్టింది. ఫ్లై ఓవర్ పై వేగంగా దూసుకొచ్చిన కారు ముగ్గురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే చనిపోయింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

వారిని 108 వాహనంలో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పారిశుద్ధ్యం కార్మికులను ఢీకొట్టిన తర్వాత  కారు ఒక ఆటోను కూడా ఢీకొట్టింది. ఆ ఆటో పూర్తిస్థాయిలో నుజ్జునుజ్జు అయింది. కారు టైర్ పంక్చర్ అయిపోయివుంది.

Air India : ఎయిరిండియా సిబ్బందికి కొత్త రూల్స్‌

వేగంగా వస్తున్న సమయంలో కారు టైర్ పగటడం వల్ల ప్రమాదం జరిగిందా? లేదా ఇతర కారణాలున్నాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కారు యజమానికి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేశాడా? అన్న కోణంలో విచారిస్తున్నారు.