మంచిలీపట్నం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి ఎవరు.. ఆ ఇద్దరిలో అధిష్టానం ఎవర్ని బరిలోకి దించబోతుంది?

మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలో వైసీపీ అభ్యర్థి ఎవరనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇద్దరి పేర్లను వైసీపీ అధిష్టానం పరిశీలిస్తోంది.

మంచిలీపట్నం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి ఎవరు.. ఆ ఇద్దరిలో అధిష్టానం ఎవర్ని బరిలోకి దించబోతుంది?

Bandar MP Candidate

Updated On : January 27, 2024 / 2:24 PM IST

Bandar YCP MP Candidate : : మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలో వైసీపీ అభ్యర్థి ఎవరనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. ఫిబ్రవరి 2వ తేదీన ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం ఇద్దరు పేర్లను పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో మాజీ మంత్రి, మచిలీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నానితో పాటు, అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ పేరును పరిశీలిస్తుంది. ఇద్దరుకూడా కాపు సామాజిక వర్గంకు చెందినవారు. మచిలీపట్నం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గంకు చెందిన వారిద్దరి పేర్లను వైసీపీ అధిష్టానం పరిశీలిస్తోంది.

Also Read : నిన్న పవన్ కల్యాణ్.. నేడు నాగబాబు.. టీడీపీ, జనసేన మధ్య అసలేం జరుగుతోంది?

పేర్ని నాని అసెంబ్లీకి పోటీ చేయడం లేదని, రాజకీయాలకు విరామం ప్రకటిస్తున్నానని పలు సందర్భాల్లో చెప్పారు. సీఎం జగన్ వద్దకూడా ఇదే విషయాన్ని వెల్లడించినట్లు తెలిసింది. ఈ క్రమంలో నియోజకవర్గాల ఇంచార్జుల మార్పులో మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జిగా పేర్నినాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని అధిష్టానం నియమించింది. అయితే, పేర్నినానిని మచిలీపట్నం పార్లమెంట్ బరిలో నిలిపేందుకు అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో పేర్నినానితో ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం. బాలశౌరి ప్రస్తుతం వైసీపీని వీడటంతో అతనికి పోటీగా ఉండాలంటే అక్కడ పేర్నినానినే సమర్ధుడైన వ్యక్తి అని అధిష్టానం భావిస్తోంది. కాపు సామాజిక వర్గంతోపాటు ఇతర సామాజిక వర్గాల్లోనూ నానికి మంచిపేరుంది. నానిని పార్లమెంట్ బరిలో నిలిపితే దానిపరిదిలో వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైసీపీకి మేలు జరుగుతుందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది.

Also Read : నెల్లూరులో కాక.. మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు షాక్!

మరోవైపు మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం బరిలో నిలిపేందుకు అవనిగడ్డ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే సిహాంద్రి రమేష్ పేరునుకూడా వైసీపీ అధిష్టానం పరిశీలన చేస్తోంది. ఈ క్రమంలో ఆ ఇద్దరు నేతల్లో పార్లమెంట్ బరిలో ఎవరు ఉంటారనే చర్చ స్థానికంగా ఆసక్తిని రేపుతోంది. ఒకటిరెండు రోజుల్లో ఈ అంశంపై అధిష్టానం క్లారిటీ ఇస్తుందని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే.. పేర్ని నాని పోటీకి సిద్ధంగాఉంటే మచిలీపట్నం పార్లమెంట్ నుంచి నాని పేరును అధిష్టానం ఖరారు చేస్తోందని తెలుస్తోంది. ఒకవేళ పేర్నినాని పోటీకి విముఖత చూపితే సిహాంద్రి రమేష్ పేరు వైసీపీ అధిష్టానం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.